మైక్రాపై భారీ డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తున్న నిస్సాన్..!!

Nissan Micra Offer
నిస్సాన్ మైక్రా కారు ఇప్పుడు మరింత చౌక ధరకే లభ్యం కానుంది. జపాన్ ఆటో దిగ్గజం నిస్సాన్ భారత మార్కెట్లో అందిస్తున్న తమ తొలి చిన్న కారు మైక్రా'పై రూ. 50,000 తగ్గింపును అందిస్తోంది. ఫెస్టివ్ సీజన్ సేల్‌లో భాగంగా పరిమిత కాలం పాటు ఈ ఆఫర్‌ను ప్రకటిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.

నిస్సాన్ మైక్రా ఎక్స్ఈ వేరియంట్ డిస్కౌంట్‌కు ముందు ధర రూ.4.1 లక్షలు, కాగా.. డిస్కౌంట్‌ అనంతరం ప్రస్తుత ధర రూ.3.6 లక్షలుగా ఉంది. ఈ వేరియంట్‌లో పవర్ స్టీరింగ్, ఒక ఎయిర్ బ్యాగ్‌లు లభిస్తాయి. కానీ పవర్ విండోస్, మ్యూజిక్ సిస్టమ్‌లు లభ్యం కావు. అయితే, ఒకరకంగా చెప్పాలంటే డిస్కౌంట్ తర్వాత నిస్సాన్ మైక్రా ధర ఫోర్డ్ ఫిగో 1.2 డ్యురాటెక్ ఎల్ఎక్స్ఐ వేరియంట్ కన్నా చవకైనది. ఫోర్డ్ ఫిగో 1.2 డ్యురాటెక్ ఎల్ఎక్స్ఐ వేరియంట్ ధర రూ.3.69 లక్షలు, ఇందులో ఎయిర్ బ్యాగ్ ఉండదు.

డిస్కౌంట్ తర్వాత నిస్సాన్ మైక్రా కారు ధరను పరిశీలిస్తే ఇది మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ ఎల్ఎక్స్ఐ వేరియంట్ ధర కన్నా కూడా తక్కువే. మారుతి వ్యాగన్ ఆర్ ఎల్ఎక్స్ఐ ధర రూ.3.65 లక్షలు. అయితే వ్యాగన్ ఆర్ ఎల్ఎక్స్ఐ వేరియంట్‌లో రెండు పవర్ విండోస్ ఉంటాయి, కానీ ఎయిర్ బ్యాగ్స్ ఉండవు. దీన్నిబట్టి చూస్తే.. ధరలోనూ, ఫీచర్లలోనూ ఈ రెండు మోడళ్ల కన్నా మైక్రానే ది బెస్ట్ అని చెప్పవచ్చు. మరింకెందుకు ఆలస్యం వెంటనే మీ నిస్సాన్ మైక్రాను ఇంటికి తెచ్చుకోండి.. త్వరపడండి..!!

More from DriveSpark

Article Published On: Wednesday, October 19, 2011, 17:09 [IST]
English summary
Nissan is offering a huge cash discount of Rs.50,000 for its Micra small car. The Micra which costs Rs.4.1 lakhs is now available at just Rs.3.6 lakhs. Further this reduced price makes the Micra more affordable than the Ford Figo LXi and even the Maruti Suzuki Wagon R LXi.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+