హైదరాబాద్ మార్కెట్లోకి నిస్సాన్ సన్నీ సెడాన్ విడుదల

మూడు వేరియంట్లలో విడుదలైన నిస్సాన్ సన్నీ సెడాన్ కారు లీటరు పెట్రోల్‌కు 16.95 కి.మీ. మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతతానికి ఇది పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే లభిస్తుంది. బ్రాంజ్ గ్రే, బ్లేడ్ సిల్వర్, స్ట్రోమ్ వైట్, సప్ప్‌హైర్ బ్లూ, ఓనిక్స్ బ్లాక్, బ్రిక్ రెడ్ అనే ఆరు ఆర్షనీమైన రంగుల్లో కొత్త నిస్సాన్ సన్నీ సెడాన్ లభ్యమవుతుంది. అతి త్వరలోనే నిస్సాన్ సన్నీ సెడాన్‌లో డీజిల్ ఇంజన్ వేరియంట్‌ను ప్రవేశపెడతామని జైన్ చెప్పారు.
కాగా.. ఎంట్రీ-లెవల్ వేరియంట్ నిస్సాన్ సన్నీ ఎక్స్ఈ ధర రూ.5,88,276, మిడ్-లెవల్ వేరియంట్ నిస్సాన్ సన్నీ ఎక్స్ఎల్ ధర రూ.7,00,230, హై-ఎండ్ వేరియంట్ వేరియంట్ నిస్సాన్ సన్నీ ఎక్స్‌వీ ధర రూ.7,81,654 (అన్ని ధరలు కూడా ఎక్స్-షోరూమ్, హైదరాబాద్) లుగా ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. నిస్సాన్ 45 ఏళ్ల క్రితం సన్నీ ఉత్పత్తిని ప్రారంభించింది. అప్పటి నుండ ఈ మోడల్‌ను ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేస్తూ వచ్చింది. ప్రస్తతం కంపెనీ విడుదల చేసిన సన్నీ 10వ తరానికి చెందినది.
ఫోర్డ్ ఫియస్టా, హ్యుందాయ వెర్నా ఫ్లూయిడిక్, హోండా సిటీ వంటి మిడ్-సెజ్ సెడాన్‌లకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది. ఈ మూడు వేరియంట్లలోనూ పవర్ స్టీరింగ్, ఎయిర్ కండిషనింగ్, డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్స్ మరియు ఈబిడితో కూడిన ఏబిఎస్ సిస్టమ్‌లు స్టాండర్డ్ ఎక్విప్‌మెంట్‌గా వస్తాయి. రానున్న ఐదేళ్లలో ఐదు కొత్త మోడళ్లను విడుదల చేస్తామని, ఈ ఏడాదిలోనే ఓ చిన్న కారును విడుదల చేయనున్నామని కంపెనీ పేర్కొంది.


Click it and Unblock the Notifications








