విడుదలకు ముందే అమ్ముడైపోయిన ఎవోక్ కార్లు!

ఈ నేపథ్యంలో రేంజ్ రోవర్ ఎవోక్‌కు ఇప్పటికే ఉత్పత్తి సామర్థ్యానికి మించి అధిక సంఖ్యలో ఆర్డర్లు వస్తున్నట్లు సమాచారం. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, భారత్‌కు రామున్న రేంజ్ రోవర్ ఎవోక్ మొదటి లాట్ ఇప్పటికే అమ్ముడైపోయినట్లు తెలుస్తోంది. పూర్తిగా బ్రిటన్‌లో తయారైన రేంజ్ రోవర్ ఎవోక్ ఎస్‌యూవీను భారత్‌కు సిబియూ (కంప్లీట్లీ బిల్డ్ యూనిట్) రూట్‌లో దిగుమతి చేసుకోనున్నారు.
నవంబర్ నెలలో మార్కెట్లోకి రానున్న రేంజ్ రోవర్ ఫస్ట్ లాట్ పూర్తిగా అమ్ముడైపోయినట్లయితే, సెకండ్ లాట్ కోసం బుకింగ్‌లను వచ్చే ఏడాదిలో ప్రారంభించే అవకాశం ఉంది. భారత్‌లో దీని ధర రూ.50 లక్షలకు పైగా ఉండొచ్చని అంచనా. సంపన్న వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకొని టాటా మోటార్స్ తీసుకువస్తున్న ఈ కారు పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో మూడు వేరియంట్లలో లభించనుంది.


Click it and Unblock the Notifications








