ఆర్‌బిఐ తాజా వడ్డింపు: మరింత ప్రియం కానున్న కార్ లోన్స్!

Car Loan
కేంద్ర ప్రభుత్వం ధరల పెరుగుదలను అదుపు చేయడం మాటేమో కానీ.. ఆ సాకుతో కొనుగోలుదారుల వీపు విమానం మ్రోత మోగిస్తుంది. వరుస వడ్డీ రేట్ల పెంపుతో భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ) కొనుగోలుదారుల జేబులకు చిల్లు పెడుతోంది. అధిక వడ్డీ రేట్ల ఇప్పటికే వాహన రుణాలు తీసుకున్న వినియోగదారులు వాటిని ఎలా తీర్చాలో తెలియక సతమతవుతుంటే.. పెరిగిన/పెరగనున్న తాజా వడ్డీ రేట్లను చూసి కొత్తగా వాహనం కొనాలనుకునే వారు బెంబేలెత్తిపోతున్నారు.

ఆర్‌బిఐ తాజాగా మరోసారి వడ్డీ రేట్లు పెంచింది. ఈ మేరకు ఆర్‌బిఐ మంగళవారం నిర్వహించిన ద్రవ్యపరపతి సమీక్షలో వడ్డీ రేచ్లను అరశాతం మేర పెంచింది. ఈ తాజా పెంపుతో రెపో రేటు (ఆర్‌బిఐ బ్యాంకులకు ఇచ్చే రుణంపై వడ్డీరేటు) 8.5 శాతానికి, రివర్స్ రెపో రేటు (బ్యాంకులు ఆర్‌బిఐ వద్ద ఉంచిన నిధులపై వచ్చే వడ్డీ) 7.5 శాతానికి పెరిగింది. అయితే, సిఆర్‌ఆర్ రేటులో మాత్రం ఎలాంటి మార్పు లేకుండా 6 శాతం మాత్రమే ఉంది. ఎస్‌ఎల్‌ఆర్ రేటు కూడా 24 శాతం గానే ఉంది.

గడచిన సంవత్సరం మార్చి నెల నుంచి ఆర్‌బిఐ ఇలా వరుసగా వడ్డీ రేట్లను పెంచడం 11వ సారి. ఆర్‌‌బిఐ వడ్డన తర్వాత వరుసగా ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకింగ్ సంస్థలు కూడా రుణాలపై ఇచ్చే వడ్డీ రేట్లను అలాగే, డిపాజిట్లపై ఇచ్చే వడ్డీ రేట్లను త్వరలోనే పెంచనున్నాయి. వీటిలో ముఖ్యంగా వాహన మరియు గృహ రుణాలు మరింత ప్రియం కానున్నాయి.

More from DriveSpark

Article Published On: Thursday, October 27, 2011, 12:13 [IST]
English summary
Car Loans will become more expensive from banks like State Bank of India (SBI) and ICICI Bank as the banks ready to raise their lending rates.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+