'ఫ్లూయెన్స్' లగ్జరీ సెడాన్‌ను భారత్‌లో విడుదల చేసిన రీనాల్ట్

Renault Fluence
ఫ్రెంచ్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ రీనాల్ట్ భారత మార్కెట్లో తమ ఫ్లాగ్‌షిప్ లగ్జరీ సెడాన్, "ఫ్లూయెన్స్‌"ను నేడు (మే 23, 2011 సోమవారం) లాంఛనంగా విడుదల చేసింది.

పెట్రోల్ మరియు డీజిల్ రెండు వేరియంట్లలో ఈ కారు లభిస్తుందని కంపెనీ తెలిపింది. రీనాల్ట్ ఫ్లూయెన్స్ కారును ఆసియన్ మార్కెట్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశామని, ఈ కారు లగ్జరీ సెగ్మెంట్‌ను ఓ ఊపు ఊపడమే కాకుండా భారత మార్కెట్‌కు తమ సత్తా ఏంటో పరిచయం చేయడంతో పాటు దేశీయ వినియోగదారులకి కంపెనీ తన తొలి రుచి చూపించనుందని రీనాల్ట్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మార్క్ నాసిఫ్ తెలిపారు.

రీనాల్ట్‌కు చెన్నైలో సమీపంలోని ఒరగాడం అసెంబ్లింగ్ ప్లాంటులో తయారైన మొట్టమొదటి బ్రాండ్ అని ఆయన తెలిపారు. ఈ కారును కంప్లీట్లీ నాక్‌డ్ డౌన్(సికెడి) రూపంలో (విడిభాగాలను భారత్‌కు దిగుమతి చేసుకొని దేశీయంగా అసెంబ్లింగ్ చేసే విధానం) దిగుమతి చేసుకొని ఇక్కడి అసెంబ్లింగ్ చేస్తున్నారు.

2లీటర్ పెట్రోల్ ఇంజన్‌ మరియు 1.5 లీడర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభించే ఫ్లూయెన్స్ కారు ధరలు రూ. 12.99 లక్షల నుంచి రూ. 14.40 లక్షలు (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి. చెన్నై ప్లాంటులో రీనాల్ట్ మరియు తన గ్లోబల్ పార్ట్‌నర్ అయిన నిస్సాన్ కంపెనీలు 2015 నాటికి రూ. 4,500 కోట్లను పెట్టుబడులుగా వెచ్చించి మొత్తం ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యాన్ని 4 లక్షల యూనిట్లను పెంచాలని నిర్ణయించాయి.

ప్రస్తుతం ఇదే ప్లాంటులో రీనాల్ట్ మరో ఇంజన్ ప్లాంటును కూడా ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఫ్లూయెన్స్ తర్వాత రీనాల్ట్ తన స్పోర్ట్స్ యటిలిటీ వాహనమైన "కొలియోస్"ను, మరో ఇతర మూడు మోడళ్లను 2012 సంవత్సరంలో విడుదల చేయనుంది. ఫ్లూయెన్స్ కారును భారత రోడ్లపై దాదాపు లక్ష కిలోమీటర్ల వరకూ కంపెనీ టెస్ట్ చేసింది.

అద్దిరిపోయే లుక్, ఆకట్టుకునే ఇంటీరియర్స్‌తో పాటు 4 ఎయిర్ బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటి కంట్రోల్, బ్రేక్ అసిస్ట్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఈ కారు సొంతం. టొయోటా 'కరోలా' సెడాన్ మరియు ఫోక్స్‌వ్యాగన్ 'జెట్టా' సెడాన్‌లకు రీనాల్ట్ ఫ్లూయెన్స్ గట్టి పోటీ ఇవ్వగలదని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది.

More from DriveSpark

Article Published On: Monday, May 23, 2011, 15:39 [IST]
English summary
French carmaker Renault today launched its luxury sedan 'Fluence' in India market with both petrol and diesel options, priced between Rs 12.99 lakh and Rs 14.40 lakh (ex showroom Delhi).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+