నేడు మార్కెట్లోకి విడుదలకానున్న స్కొడా ర్యాపిడ్

మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి సిద్దం చేసుకున్న తర్వాత ర్యాపిడ్ సెడాన్‌ను మార్కెట్లోకి విడుదల చేయాలని కంపెనీ భావించింది. ఇందులో భాగంగానే డెలివరీలు ఆలస్యం కాకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో ర్యాపిడ్ సెడాన్ ఉత్పత్తిని సిద్ధం చేసుకున్న తర్వాతే స్కొడా ఈ మోడల్‌ను అధికారికంగా మార్కెట్లో తీసుకువస్తుంది. స్కొడా ఇదివరకూ అందించిన ఆక్టావియా సెడాన్ స్థానంలో ర్యాపిడ్ విడుదల కానుంది.
ప్రత్యేకంగా భారతీయుల అభిరుచులకు అనుగుణంగా తీర్చిదిద్దిన స్కొడా ర్యాపిడ్ సెడాన్ ఫోక్స్‌వ్యాగన్ వెంటో కన్నా తక్కువ ధరను కలిగి ఉండనుంది. స్కొడా ర్యాపిడ్ పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభ్యం కానుంది. పెట్రోల్ వేరియంట్ స్కొడా ర్యాపిడ్ సెడాన్ 1.6 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తోనూ అలాగే డీజిల్ వేరియంట్ స్కొడా ర్యాపిడ్ సెడాన్ 1.6 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్‌తోనూ లభ్యం కానుంది.


Click it and Unblock the Notifications








