టీవీషోలో ర్యాపిడ్ సెడాన్‌ను ఆవిష్కరించిన స్కొడా

ప్రత్యేకంచి భారత వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన ర్యాపిడ్ సెడాన్ ఉత్పత్తిని పూణేకు సమీపంలో ఉన్న చాకన్ ప్లాంటులో కంపెనీ ఇటీవలే ప్రారంభించింది. ఇటీవలే మరుగున పడిపోయిన ఆక్టావియా మోడల్ స్థానాన్ని ర్యాపిడ్ సెడాన్ భర్తీ చేయనుంది.
ర్యాపిడ్ సెడాన్‌ను తొలిసారిగా ఫ్రాంక్‌ఫర్ట్‌లో జరిగిన ఆటో షోలో విజన్-డి కాన్సెప్ట్ పేరుతో ప్రదర్శించారు. ర్యాపిడ్ సెడాన్‌ను ఫోక్స్‌వ్యాగన్ వెంటో ఆధారంగా నిర్మించనున్నారు. అంతేకాకుండా ఫోక్స్‌వ్యాగన్ సెడాన్ ధర కన్నా తక్కువగా ఉండేలా ర్యాపిడ్‌ను రూపొందిస్తున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications








