నవంబర్ 16న మార్కెట్లోకి రానున్న స్కొడా ర్యాపిడ్

Skoda Rapid
చెక్-రిపబ్లిక్‌కు చెందిన ఆటో దిగ్గజం, ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ అనుబంధ సంస్థ స్కొడా ఆటో ఇండియా, తమ ఎంట్రీ లెవెల్ సెడాన్ 'స్కొడా రాపిడ్'ను అధికారికంగా మార్కెట్లో విడుదల చేయడానికి ముహుర్తం ఖరారు చేసింది. గత నెల రెండో వారంలో ఎన్డీటీవీ కార్ అండ్ బైక్ షో స్కొడా ర్యాపిడ్ సెడాన్ కంపెనీ ఆవిష్కరించింది. కాగా.. ఈ నెల 16వ (నవంబర్ 16, 2011) తేదీన స్కొడా ర్యాపిడ్ వాణిజ్య పరంగా దేశీయ మార్కెట్లో విడుదల కానుంది.

స్కొడా ఆక్టావియా సెడాన్ స్థానాన్ని భర్తీ చేసేందుకు వస్తున్న స్కొడా ర్యాపిడ్‌ను ప్రత్యేకంచి భారతీయ వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించినట్లు కంపెనీ పేర్కొంది. ర్యాపిడ్ సెడాన్‌ ఉత్పత్తిని పూణేకు సమీపంలో ఉన్న చాకన్ ప్లాంటులో కంపెనీ ఉత్పత్తి చేస్తోంది. ప్రస్తుతం ఫోక్స్‌వ్యాగన్ నుంచి మార్కెట్ అందుబాటులో ఉన్న వెంటో సెడాన్ ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా ర్యాపిడ్ సెడాన్‌ను రూపొందించారు.

స్కొడా ర్యాపిడ్ పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభ్యం కానుంది. పెట్రోల్ వేరియంట్ స్కొడా ర్యాపిడ్ సెడాన్ 1.6 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తోనూ అలాగే డీజిల్ వేరియంట్ స్కొడా ర్యాపిడ్ సెడాన్ 1.6 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్‌తోనూ లభ్యం కానుంది. స్కొడా ర్యాపిడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ సిస్టమ్‌తో లభ్యం కానుంది. ర్యాపిడ్‌ను తొలిసారిగా ఫ్రాంక్‌ఫర్ట్‌లో జరిగిన ఆటో షోలో విజన్-డి కాన్సెప్ట్ పేరుతో స్కొడా ప్రదర్శనకు ఉంచింది. దీని ధర వెంటో కన్నా తక్కువగా ఉండొచ్చని అంచనా.

More from DriveSpark

Article Published On: Wednesday, November 2, 2011, 10:55 [IST]
English summary
Skoda India has confirmed the launch date of the Rapid sedan. The Rapid will be in showrooms on November 16th and the Czech carmaker will be announcing the price. The Rapid was first displayed in the Car and Bike Show in NDTV.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+