కాంపాక్ట్ సెడాన్ 'ర్యాపిడ్' ఉత్పత్తిని ప్రారంభించిన స్కొడా

Skoda Rapid
చెక్-రిపబ్లిక్‌కు చెందిన ఆటో దిగ్గజం, ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ అనుబంధ సంస్థ అయిన స్కొడా ఆటో ఇండియా, భారత్‌లోని పూణేకు సమీపంలో ఉన్న చాకన్ ప్లాంటులో తమ ఎంట్రీ లెవెల్ సెడాన్ 'స్కొడా రాపిడ్' ఉత్తత్తిని ప్రారంభించినట్లు ప్రకటించింది. స్కొడా ర్యాపిడ్ ప్రత్యేకంగా భారత వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని, పూర్తిగా భారత్‌లో తయారవుతున్న స్కొడా బ్రాండ్ కారు.

భారత్‌లో కొత్త కాంపాక్ట్ రాపిడ్ సెలూన్‌ ఉత్పత్తిని అధికారికంగా ప్రారంభిస్తున్నామని, ఈ శుక్రవారం తొలి రాపిడ్ కారును ఉత్పత్తి చేశామని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. అతి త్వరలోనే ఈ కారును దేశీయ విపణిలోకి విడుదల చేయనున్నామని, ఐదుగురు ప్రయాణీకులు హాయిగా ప్రయాణించేలా, కారు లోపల ఎక్కువ స్థలం ఉండేలా దీన్ని తీర్చిదిద్దామని కంపెనీ స్కోడా ఆటో బోర్డు ఆఫ్ మేనేజ్‌మెంట్ చైర్మన్ విన్‌ఫ్రైడ్ వాహ్‌లాండ్ తెలిపారు.

స్కొడా ర్యాపిడ్ డీజిల్ మరియు పెట్రోల్‌ వేరియంట్లలో లభించనుంది. ఇదే ప్లాంటులో స్కొడా ఫ్యాబియా సెడాన్‌ కూడా ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుతం పండుగ సీజన్ నేపథ్యంలో స్కొడా అందిస్తున్న వివిధ మోడళ్లపై డిస్కౌంట్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే.

More from DriveSpark

Article Published On: Saturday, October 8, 2011, 10:45 [IST]
English summary
Czech republic based carmaker and Volkswagen group company Skoda Auto said, it has started production of its upcoming entry level sedan Rapid from the group's Chakan plant, near Pune. The car will be launched in the Domestic market soon.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+