మహిళలకు కారు పార్కింగ్ చేయడం రాదు: అధ్యయనం!!

అయితే, తాజా అధ్యయనం వెల్లడిస్తున్న వివరాల ప్రకారం, స్త్రీలు పార్కింగ్ సమయంలో పలు సమస్యలు ఎదుర్కుంటున్నారని, అసలు వారికి వాహనాన్ని సరిగ్గా పార్కింగ్ చేయడం రాదని తేలింది. బ్రిటన్‌కు చెందిన 'డ్రైవింగ్ స్టాండర్డ్స్ ఏజెన్సీ' విడుదల చేసిన గణాంకాల ప్రకారం, పార్కింగ్ విషయంలో స్త్రీలతో పోల్చుకుంటే పురుషులే చక్కగా పార్కింగ్ చేస్తారని వెల్లడైంది.
బ్రిటన్‌లో దాదాపు ప్రతి మూడో మహిళ గతేడాది ప్యారలల్ పార్కింగ్ అంశంలో విఫలమైన కారణంగా డ్రైవింగ్ టెస్ట్‌ను ఫెయిల్ అయ్యారని ఈ అధ్యయనం తెలిపింది. 2010లో వివిధ తప్పిదాల కారణంగా 1,70,000 మంది మహిళలు డ్రైవింగ్ టెస్ట్‌ను పాస్ కాలేకపోయారని, మరో 55,000 మంది మహిళలు పార్కింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారని డైలీ మెయిల్ ప్రచురించింది.
అలాగే, జర్మనీలోని రుహర్ యూనివర్సిటీ బోచుమ్ పరిశోధకులు కూడా ఇదే అంశంపై జరిపిన అధ్యయనంలో కూడా పార్కింగ్ విషయంలో పురుషులే బెస్ట్ అని తేల్చారు. పరిశోధకులు 65 మంది వాలంటీర్లను ఓ ఆడి కారును పార్క్ చేయమనగా.. పురుషులు కన్నా మహిళలు 20 సెకండ్లకు పైగా అధిక సమయాన్ని తీసుకున్నట్లు తేలింది.
యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ పరిశోధకులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. డ్రైవింగ్‌లో పురషులు కన్నా మహిళలే అధికంగా యాక్సిడెంట్‌లు చేసినట్లు వారి అధ్యయనంలో తేలింది. టి-జెంక్షన్లు, జారుడు రోడ్లపై స్త్రీలు అధికంగా ఇబ్బందులను ఎదుర్కున్నట్లు వీరి అధ్యయనంలో వెల్లడైంది. మరి అమ్మాయిలు మీరేమంటారు... ఈ అధ్యయనాలను అంగీకరిస్తారా..!?


Click it and Unblock the Notifications








