టాటా ఆరియా క్రాసోవర్‌పై రూ.2 లక్షల డిస్కౌంట్

ఈ డిస్కౌంట్‌లో రూ.1.6 లక్షల నగదు తగ్గింపును, రూ.40,000 ఎక్సేంజ్ బోనస్‌ను పొందవచ్చు. ఈ డిస్కౌంట్ అనంతరం టాటా ఆరియా (4X2) బేస్ వేరియంట్ రూ.9.99 (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) లక్షలకే లభ్యమవుతుంది. ఈ ఆఫర్‌ను "టాటా ఆరియా వార్షికోత్సవ సేల్" అని టాటా మోటార్స్ ప్రకటించింది. గడచిన ఆగస్టునెలలో టాటా ఆరియాలో టూ-వీల్ డ్రైవ్ ఆప్షన్ కలిగిన వేరియంట్‌ను కంపెనీ విడుదల చేసింది.
సెడాన్‌లోని విలాసవంతమైన ఫీచర్లు, ఎస్‌యూవీలోని శక్తిల కలయికే ఈ సరికొత్త టాటా ఆరియా. కొత్త టాటా ఆరియా 4x2 క్రాసోవర్ కారు 2.2 లీటర్ డైరెక్ట్ ఇంజెక్షన్ కామర్ రైల్ డీజిల్ ఇంజిన్‌తో 140 పీఎస్ పవర్‌ను మరియు 320 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది లీటరు డీజిల్‌కు 13.7 కి.మీ.మైలేజీనిస్తుంది. ఇంకా ఇందులో శాటిలైట్ నావిగేషన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, బ్లూటూత్, డ్రైవర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వంటి అధునాతన ఫీచర్లు కూడా ఉన్నాయి.
ప్రీమియం లెథర్ సీటింగ్ ఇందులో మరో అదనపు ఆకర్షనగా నిలువనుంది. అంతేకాకుండా.. కొత్త ఆరియాలో ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్(ఈబిడి)తో కూడిన యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్) వంటి సేఫ్టీ ఫీచర్లను కూడా అమర్చడం జరిగింది. ప్యూర్, ప్లెజర్, ప్రెస్టీజ్ అనే మూడు వేరియంట్లలో టాటా ఆరియా లభ్యమవుతుంది.


Click it and Unblock the Notifications








