సెలబ్రేషన్ ఎడిషన్ 'మాంజా' విడుదల చేసిన టాటా మోటార్స్!

ప్రస్తుతం ఉన్న మాంజాలో ఆప్షనల్‌గా లభించే ఎన్నోరకాల ఫీచర్లు ఈ సరికొత్త మాంజా సెలబ్రేషన్ ఎడిషన్‌లో లభించనున్నాయి. దీపావళి పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని టాటా మోటార్స్ ఈ కొత్త మాంజాను మార్కెట్లో ప్రవేశపెట్టింది. కొత్త వేరియంట్‌ను ప్రవేశపెట్టాలనే ఉద్దేశ్యంతో ప్రస్తుతం ఉన్న మాంజా వేరియంట్లపై కంపెనీ భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేసిన సంగతి తెలిసిందే.
కాగా.. టాటా మాంజా సెలబ్రేషన్ ఎడిషన్ వేరియంట్ ధరను రూ.749 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా కంపెనీ నిర్ణయించింది. ఇందులో రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, లెథర్ ఫీల్ ఇంటీరియర్స్, రిచ్ బ్లాక్ ఇంటీరియర్స్ ఉన్నాయి మాంజా ఎలాన్ కన్నా ఇది టాప్-ఎండ్ వేరియంట్. మాంజా ఎలాన్‌తో పోల్చుకుంటే సెలబ్రేషన్ ఎడిషన్ డీజిల్ వేరియంట్ ధర రూ.27,000 అధికంగానూ, సెలబ్రేషన్ ఎడిషన్ పెట్రోల్ వేరియంట్ ధర రూ.17,000 అధికంగానూ ఉంది. మాంజా సెలబ్రేషన్ ఎడిషన్ ఇంజన్లలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు.


Click it and Unblock the Notifications








