మే నెల విక్రయాలలో 10 శాతం వృద్ధి: టాటా మోటార్స్

టాటా మోటార్స్ మే 2010లో 21,324 ప్యాసింజర్ వాహనాలను విక్రయిస్తే.. మే 2011లో కేవలం 19,401 వాహనాలను మాత్రమే విక్రయించింది. అయితే టాటా మోటార్స్ ముద్దుల కారు టాటా నానో విక్రయాలు జోరందుకున్నాయి. ఏప్రిల్ నెలలో 10,000కు అమ్ముడైన నానో కార్లు ప్రతికూల మార్కెట్ పరిస్థితుల్లో కూడా మే నెలలో 84 శాతం వృద్ధిని సాధించి 6,515 యూనిట్లు అమ్మడయ్యాయి.
సుమో, సఫారీ, ఆరియా మోడళ్లు కలిపి 15 శాతం వృద్ధి చెంది 3,121 యూనిట్లు అమ్ముడయ్యాయి. వాణిజ్య వాహన విభాగంలో విక్రయాలు 19 శాతం వృద్ధితో 37,361 యూనిట్లకు పెరిగాయి.


Click it and Unblock the Notifications








