టాటా నానో డీజిల్ వేరియంట్ మైలేజ్ వివరాలు లీక్..!

Tata Nano
టాటా మోటార్స్ అందిస్తున్న ప్రపంచంలోనే అత్యంత చవకైన కారు 'టాటా నానో'లో కంపెనీ ఓ డీజిల్ వేరియంట్‌ నానోను ప్రవేశపెట్టనున్నట్లు మేము గతంలోనే విభిన్న కథనాల్లో ప్రచురించిన సంగతి తెలిసిందే. అప్పట్లో టాటా నానో డీజిల్ వేరియంట్ లీటరు డీజిల్‌కు 40 కి.మీ. మైలేజీనిస్తుందనే పుకార్లు కూడా షికార్లు చేశాయి.

అయితే, ఇప్పుడు టాటా నానో డీజిల్ వేరియంట్‌కు సంబంధించిన మైలేజ్ వివరాలు లీక్ అయ్యాయి. ఇది గతంలో చెప్పుకున్నట్లుగా లీటరుకు 40 కి.మీ. మైలేజీని కాకుండా లీటరుకు 30 కి.మీ. పైగా మైలేజీనిస్తుందని సమాచారం. ప్రస్తుతం టాటా నానో 650 సీసీ పెట్రోల్ ఇంజన్‌తో లభ్యమవుతుంది. టాటా నానో పెట్రోల్ ఇంజన్ల తయారీలో ప్రముఖ విడిభాగాల సంస్థ బోష్ హస్తం కూడా ఉంది.

అంతేకాకుండా.. బోష్ టాటా నానో కారుకు డీజిల్ ఇంజన్లను అభివృద్ధి చేయడంలో కూడా కీలక పాత్ర పోషిస్తోంది. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం టాటా నానో డీజిల్ వేరియంట్ ప్రతి లీటర్ డీజిల్‌కు 30-34 కి.మీ. మైలేజీని ఇవ్వొచ్చని అంచనా. ఏఆర్ఏఐ స్టాండర్డ్స్ ప్రకారం, టాటా నానో డీజిల్ 30 కి.మీ. పైగా మైలేజీని ఇవ్వగలిగినట్లయితే.. ప్రపంచంలోనే అత్యంత చవకైన కారు కాస్తా దేశంలోనే అత్యధిక మైలేజీనిచ్చే కారుగా కూడా నిలువనుంది.

More from DriveSpark

Article Published On: Thursday, October 20, 2011, 10:50 [IST]
English summary
Diesel cars are the most preferred cars in India in recent months. It is evident that the difference in price and running costs between petrol and diesel has made the diesel, the preferred fuel to many Indians. At this juncture Tata Motors is slowly developing a diesel engine for its Nano.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+