టాటా కార్లపై డిస్కౌంట్స్, లో డౌన్‌పేమెంట్ స్కీమ్స్

టాటా మోటార్స్ అందిస్తున్న అత్యధిక మైలేజీలనిచ్చే కార్లు ఇండికా ఈవీ2, ఇండిగో ఈసిఎస్ మరియు కంపెనీ ఇటీవల విడుదల చేసిన మాంజా, కొత్త విస్టా మోడళ్లపై ప్రత్యేక డిస్కౌంట్లను మరియు తక్కువ డౌన్‌పేమెంట్ పథకాలను ఆఫర్ చేస్తుంది. టాటా మోటార్స్ తమ కార్లపై అందిస్తున్న డిస్కౌంట్లు, లో డౌన్‌పెమెంట్ ఆఫర్ల వివరాలు కింది విధంగా ఉన్నాయి:
* ఇండికా మోడల్‌పై డౌన్‌పేమెంట్ రూ.25,000 మరియు రూ.12,000 స్పెషల్ డిస్కౌంట్
* కొత్త విస్టా మోడల్‌పై డౌన్‌పేమెంట్ రూ.30,000 మరియు రూ.10,000 స్పెషల్ డిస్కౌంట్
* ఇండిగో ఈసిఎస్ మోడల్‌పై డౌన్‌పేమెంట్ రూ.35,000 మరియు రూ.12,000 స్పెషల్ డిస్కౌంట్
* మాంజా మోడల్‌పై డౌన్‌పేమెంట్ రూ.50,000 మరియు రూ.15,000 స్పెషల్ డిస్కౌంట్
ఈ ఆఫర్లు అన్నీ కూడా పరిమిత కాలం మాత్రమేనని టాటా మోటార్స్ ప్రకటించింది. ఈ ఆఫర్ ఆన్-రోడ్ ధర (అన్ని పన్నులు, ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్‌లతో కలిపి)పై వర్తిస్తుందని కంపెనీ తెలిపింది. ఇవి కాకుండా టాటా మోటార్స్ అందిస్తున్న ప్రజల కారు టాటా నానోపై కూడా రూ.15,000 డౌన్‌పేమెంట్‌ను రూ.20,000 వరకూ డిస్కౌంట్‌ను కూడా అందిస్తోంది.


Click it and Unblock the Notifications








