సెడాన్ ఫీచర్స్ + ఎస్‌యూవీ పవర్ = టాటా ఆరియా

* సెడాన్ యొక్క లగ్జరీ ఫీచర్లను మరియు ఎస్‌యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం) యొక్క పవర్‌లను కలిపి టాటా ఆరియా కొత్త క్రాసోవర్‌ను రూపొందించారు.
* ఇందులో ఉపయోగించిన 2.2 లీ. డీజిల్ కామన్ రైల్ ఇంజన్ 140 పిఎస్‌ల శక్తిని మరియు 320 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది.
* ఇందులోని విలాసవంతమైన ప్రీమియం లెథర్ సీటింగ్ థియేటర్-స్టైల్ అనుభూతిని కల్పిస్తూ ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది.
* కొత్త టాటా ఆరియాలో అమర్చిబడిన డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్ అన్నివైపుల నుంచి ప్రయాణికులను రక్షిస్తాయి.
* ఇంకా ఇందులో చీకటిని గుర్తించి ఆటోమేటిక్‌గా పనిచేసే హెడ్‌లైట్లు మరియు వర్షాన్ని గుర్తించి ఆటోమేటిక్‌గా పనిచేసే వైపర్లు ఉన్నాయి.
* స్టీరింగ్‌కు మొబైల్ ఫోన్‌ను అమర్చుకునే సౌకర్యం మరియు స్టీరింగ్ మౌంటెడ్ మ్యూజిక్ కంట్రోల్స్.
* ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ద్వారా వాతావరణానికి అనుగుణంగా పనిచేసే ఏసి (ఎయిర్ కండిషనింగ్).
* అత్యవసర సమయాల్లో బ్రేక్ వేయాల్సివచ్చినప్పుడు సురక్షితమైన బ్రేకింగ్ కోసం ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) మరియు ఈబిడి (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్) వంటి సేఫ్టీ ఫీచర్లు.
* ఎలక్ట్రానికల్లీ అడ్జస్టబుల్ అండ్ రీట్రాకబుల్ ఓఆర్‌విఎమ్‌లు.
* 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్ వంటి అత్యత్తమ ఫీచర్లు కొత్త టాటా ఆరియా 4x2 క్రాసోవర్ సొంతం.
టాటా ఆరియా 4x2 క్రాసోవర్, ఆరియా ప్రెస్టీజ్, ఆరియా ప్లెజర్ మరియు ఆరియా ప్యూర్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. మొదటి దశలో భాగంగా దేశంగా వ్యప్తంగా ఉన్న 85 నగరాల్లోని 150 షోరూమ్‌లలో టాటా ఆరియా 4x2 క్రాసోవర్ లభ్యం కానుంది. ఇకపోతే దేశీయ మార్కెట్లో దీని ప్రారంభ ధర రూ. 11.61 లక్షలు (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ)గా ఉంది.


Click it and Unblock the Notifications








