సెప్టెంబర్ 9న డీజిల్ వేరియంట్ ఎతియోస్, లివా విడుదల

Etios Liva
జపాన్ ఆటో దిగ్గజం టొయోటా భారత మార్కెట్లో అందిస్తున్న ఎతియోస్ సెడాన్ మరియు ఇదే ఫ్లాట్‌ఫామ్ రూపొందించిన హ్యాచ్‌బ్యాక్ వేరియంట్ ఎతియోస్ లివా మోడళ్ల డీజిల్ వేరియంట్ల గురించి వన్ఇండియా ఆటోమొబైల్ గతంలో ప్రచురించినట్లుగానే ఈ రెండు మోడళ్లు కూడా సెప్టెంబర్ 9వ తేదీన అధికారికంగా మార్కెట్లోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నాయి.

ఇదే విషయాన్ని టొయోటా కిర్లోస్కర్ మోటార్స్ (టికెఎమ్) ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. భారత్‌లోని కిర్లోస్కర్ గ్రూపుతో జపాన్‌కు చెందిన టొయోటా మోటార్ కార్పోరేషన్ జాయింట్ వెంచర్‌గా ఏర్పడి కార్యకలాపాలను కొనసాగిస్తుంది. గతేడాదిలో ఈ జేవీ నుంచి ఎతియోస్ సెడాన్ కారు విడుదల కాగా.. ఏడాది జూన్ నెలలో ఎతియోస్ సెడాన్ ఫ్లాట్‌ఫామ్‌పై హ్యాచ్‌బ్యాక్ వేరియంట్‌ లివా విడుదలైంది.

డీజిల్ వేరియంట్ ఎతియోస్, లివా మోడళ్ల విడుదలకు సంబంధించి టొయోటా కిర్లోస్కర్ మోటార్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ (మార్కెటింగ్) సందీప్ సింగ్ మాట్లాడుతూ.. "ఈ రెండు కార్లలో డీజిల్ వేరియంట్లను సెప్టెంబర్ 9న విడుదల చేస్తున్నాం. వాస్తవానికి ఈ రెండు వెర్షన్లను ఆగస్టులోనే విడుదల చేయాలని నిర్ణయించాం, కానీ జపాన్ సునామీ, భూకంపం కారణంగా ఒక నెల వాయిదా వేశామ"ని అన్నారు.

ఈ నేపథ్యంలో ఇప్పటికే డీజిల్ వేరియంట్ కార్ల బుకింగ్‌లను కొందరు టొయోటా డీలర్లు అనధికారికంగా ప్రారంభించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో టొయోటా ఎతియోస్ లివా పెట్రోల్ వేరియంట్లో మాత్రమే లభ్యమవుతుంది. దేశీయ మార్కెట్లో దీని ధర రూ. 3.99 నుంచి రూ. 5.99 లక్షల (ఎక్స్‌-షోరూమ్‌ ఢిల్లీ)గా ఉంది. ఎతియోస్ లివా భారత్‌లో టొయోటాకు తొలి కాంపాక్ట్ కారు. డీజిల్ వేరియంట్ లివా లీటరుకు 21 కి.మీ. మైలేజీని ఇవ్వవచ్చునని అంచనా.

More from DriveSpark

Article Published On: Monday, September 5, 2011, 11:24 [IST]
English summary
Japanese carmaker Toyota's Indian subsidiary Toyota Kirloskar Motors (TKM) confirmed the launch date of the diesel versions Etios sedan and Etios Liva hatchback. According to company's Deputy Managing Director Sandeep Singh (Marketing) Both Etios and Liva will hit the Indian roads on 9th of September.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+