కాంపాక్ట్ కారు 'ఎతియోస్ లివా'ను విడుదల చేసిన టొయోటా

టొయోటా ఎతియోస్ లివా కారు ధర రూ. 3.99 నుంచి రూ. 5.99 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)గా నిర్ణయించినట్లు కంపెనీ పేర్కొంది. భారత కార్ మార్కాట్లో లివా విడుదలతో టొయోటా కాంపాక్ట్ కార్ సెగ్మెంట్లోకి ప్రవేశించినట్లయింది. ఇది ఈ సెగ్మెంట్లోని మారుతి సుజుకి స్విఫ్ట్, రిట్జ్, హ్యుందాయ్ ఐ10, ఐ20, ఫోర్డ్ ఫిగో, చెవర్లే బీట్ వంటి కాంపాక్ట్ కార్లకు లివా గట్టి పోటీ ఇవ్వగలదని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది.


Click it and Unblock the Notifications








