ప్రపంచపు నంబర్ వన్ కార్ల తయారీ సంస్థ టొయోటా మోటార్ కార్పోరేషన్ తాజగా మరో రీకాల్ చేసింది. ఈసారి 51,000 టుండ్రా ట్రక్కులను అమెరికా, కెనడా మార్కెట్‌లను రీకాల్ చేస్తుననట్లు కంపెనీ ప్రకటించింది. ట్రక్కు డ్రైవ్ షాఫ్ట్‌లో లోపం కారణంగా వీటిని వెనక్కు పిలిపిస్తున్నట్లు కంపెనీ వివరించింది. అయితే ఇప్పటికి వరకూ ఈ లోపం కారణంగా ఎలాంటి ప్రమాదాలు జరిగినట్లు నమోదు కాలేదని, ముందు జాగ్రత్త కోసమే ఈ చర్యలు తీసుకుంటున్నామని టొయోటా తెలిపింది.
2011 మోడల్‌కు చెందిన టుండ్రా ట్రక్కుల తనిఖీతో పాటు దానికి కావాల్సిన విడిభాగాలను, సర్వీసు ఉచితంగా అందజేస్తామని కంపెనీ తెలిపింది. రియర్ డ్రైవ్ షాఫ్ట్ తనిఖీకు దాదాపు 10 నిమిషాల సమయం పడుతుందని కంపెనీ పేర్కొంది. ఈ రీకాల్ గురించి ట్రుండా ట్రక్ డ్రైవర్లుకు టొయోటా లేఖల ద్వారా సమాచారం అందించనుంది.