ఇండికా, ఇండిగో మైలేజ్‌పై టాటా కొత్త వాణిజ్య ప్రకటన

ఈ నేపథ్యంలో 25 కి.మీ. మైలేజ్‌ను థీమ్‌గా చేసుకొని టాటా మోటార్స్ ఓ టెలివిజన్ వాణిజ్య ప్రకటనను రూపొందించింది. '25 నహీ తో కుచ్ నహీ' (25 లేకపోతే ఏమీ లేదు) అనే థీమ్ నేపథ్యంలో ఈ టెలివిజన్ వాణిజ్య ప్రకటన సాగనుంది. అంటే, ఈ ప్రకటనలో టాటా మోటార్స్ తమ కార్లు అందించే అద్భుతమైన మైలేజ్ (25 కెఎమ్‌పిల్)ను హైలైట్ చేయడాన్ని మనం గమనించవచ్చు.
ఈ రెండు కార్ల ద్వారా ప్రజలు ఎంత స్ఫూర్తి పొందారో అనే అంశాన్ని ఈ టివి ప్రకటన స్పష్టం చేస్తుంది. ప్రకటనకు సంభందించిన వివరాల్లోకి వెళితే.. ఓ టెలివిజన్ సీరియల్ షూటింగ్‌లో ఒక ఆవిడ ఒక అతనిని చెంపదెబ్బ కొట్టే సన్నివేశం. అయితే, ఈ షాట్‌ను అప్పటికే 22 టేక్‌లు తీయడం జరుగుతుంది. దీంతో చిరాకెత్తిన అతను (చెంప దెబ్బలు తిన్న వ్యక్తి) డైరెక్టర్‌తో ఇంకా ఎన్ని షాట్‌లు అని అడుగుతుంటాడు.
అప్పుడు డైరెక్టర్ ఇంకొక మూడు టేక్‌లు మాత్రమే అంటాడు. అప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో 25 నహీ తో కుచ్ నహీ అంటూ టాటా ఇండిగో, ఇండికా కార్ల మైలేజ్‌కు సంబంధించిన ప్రకటన వస్తుంది. అలా టాటా మోటార్స్ తమ ఇండికా ఈవీ2, ఇండిగో ఈసిఎస్ కార్ల యొక్క మైలేజ్‌ను హైలైట్ చేసే ప్రయత్నం చేశారు. వాస్తవానికి, ఈ వాణిజ్య ప్రకటన రేపటి నుండి టెలివిజన్లలో ప్రసారం కానుంది. మా విలువైన వన్ఇండియా పాఠకుల కోసం.. ఈ వాణిజ్య ప్రకటనను అందరికన్నా ముందుగా ఈ కథనంలో చూపించడం జరుగుతోంది. చూసి ఆనందించండి.


Click it and Unblock the Notifications








