వర్కర్ల సలహాలతో రూ. 160 కోట్లు ఆదా చేసిన మారుతి సుజుకి

కంపెనీలో ఔత్సాహిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, కంపెనీ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు డబ్బును ఆదా చేసే విధంగా సలహాలు ఇవ్వమని తమ వర్కర్లను, ఉద్యోగులను ప్రోత్సహిస్తున్నామని మారుతి సుజుకి ఇండియా (ఎమ్ఎస్ఐ) మేనేజింగ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (అడ్మినిస్ట్రేషన్) ఎస్‌వై సిద్ధిక్ వెల్లడించారు. అయితే గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఎంత ఆదా చేసిందనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. అయితే 2009-10 ఆర్థిక సంవత్సరంలో 200 కోట్ల రూపాయాలను ఆదా చేశాయమని ఆయన చెప్పారు.
ముఖ్యంగా సుజుకి మోటార్ కార్పోరేషన్ మరియు దాని ఇతర అనుబంధ సంస్థలు అందించిన ప్రత్యేక సూచనల కారణంగా ఆ ఆర్థిక సంవత్సరంలో దీనిని సాధించగలిగామని సిద్దిక్ చెప్పారు. అయితే కంపెనీ వర్గాల సమాచారం ప్రకారం.. 2010-11 ఆర్థిక సంవత్సరంలో ఇలా సలహాల ద్వారా కంపెనీ రూ. 160 కోట్లు ఆదా చేసినట్లు సమాచారం. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం 2.29 లక్షల సలహాలను వర్కర్ల నుంచి అందుకోగా.. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం (2009-10)లో కేవలం 1.29 లక్షల సలాహాలను మాత్రమే అందుకుంది.
ఇలా సలహాలు అందించిన వర్కర్లకు ప్రోత్సాహాకాలను ఇవ్వనున్నామని సిద్దిక్ చెప్పారు. గుర్గావ్-మానేసర్ ప్రాంతంలో వర్కర్లు ఆందోళనలు చేస్తుంటే తమ కంపెనీ వర్క్‌ఫోర్స్‌ను ఎలా మేనేజే చేయగలిగారన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. అన్ని స్థాయిల్లోనూ పారదర్శకత అనేది చాలా ముఖ్యమైనదని, సరైన వర్క్‌ఫోర్స్ ఎప్పుడూ కంపెనీకు వ్యతిరేకంగా ప్రవర్తించదని ఆయన చెప్పారు. వర్కర్లతో మంచి సంబంధాలను కొనసాగించేందుకు యాజమాన్యం ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుందని ఆయన తెలిపారు.


Click it and Unblock the Notifications








