హైదరాబాద్‌లో కొత్త డీజిల్ వెంటోను విడుదల చేసిన ఫోక్స్‌వ్యాగన్

ఇప్పటి వరకూ వెంటో డీజిల్ సెడాన్ ట్రెండ్‌లైన్, హైలైన్ అనే రెండు వేరియంట్లలో లభ్యమవుతుండేది. ఈ రెండు వేరియంట్లకు మధ్యలో కంఫర్ట్‌లైన్ మిడ్ వేరియంట్‌ను ఫోక్స్‌వ్యాగన్ ప్రవేశపెట్టింది.
ఇందులో, కారు బాడీ రంగులో ఉండే డోర్ హ్యాండిల్స్, సైడ్ మిర్రర్స్, రేడియో, సిడి, ఎమ్‌పి3 ప్లేయర్‌తో కూడిన మ్యూజిక్ సిస్టమ్, వెనుకపై అమర్చిన సెంటర్ ఆర్మ్ రెస్ట్, ముందు వైపు, వెనుక వైపు అమర్చిన ఫాగ్ ల్యాంప్స్, డ్రైవర్ ఎత్తుకు అనుగుణంగా సర్దుబాటు చేసుకోగల అడ్జస్టబిల్ సీట్, యాంత్రికంగా నియంత్రించబడే రియర్ వ్యూ మిర్రర్స్ వంటి ప్రత్యేక ఫీచర్లున్నాయని కంపెనీ పేర్కొంది.
కంఫర్ట్‌లైన్ వేరియంట్ వెంటో సెడాన్‌లో 1.6 లీటర్ టిడిఐ టర్బో డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 105 బిహెచ్‌పిల శక్తిని, 250 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది. భారత మార్కెట్లో పోలో, వెంటో, జెట్టా, పాస్సాట్, న్యూ బీటెల్, టోరెగ్, ఫేటన్ మోడళ్లను ఫోక్స్‌వ్యాగన్ అందిస్తోంది. ఇది కాకుండా దేశీయ మార్కెట్ కోసం పోలోకు దిగువన మరో చిన్న కారును ప్రవేశపెట్టాలని కంపెనీ యోచిస్తోంది.


Click it and Unblock the Notifications








