త్వరలో ఇండియాకు రానున్న చెవర్లే ట్రైల్‌బ్లేజర్ ఎస్‌యూవీ

New Chevrolet Trialblazer
జపాన్ ఆటో దిగ్గజం టొయోటా అందిస్తున్న ప్రీమియం ఎస్‌యూవీ ఫార్చ్యూనర్‌ను టార్గెట్ చేస్తూ అమెరికా ఆటో దిగ్గజం జనరల్ మోటార్స్ రూపొందించిన చెవర్లే ట్రైల్‌బ్లేజర్ ఎస్‌యూవీని కంపెనీ థాయ్‌లాండ్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ మోడల్‌ను భవిష్యత్తులో ఇండియన్ మార్కెట్లో కూడా విడుదల చేసే అవకాశం ఉంది. అయితే ఇందుకు సంబంధించి కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయప్పటికీ సానుకూల సంకేతాలు మాత్రం కనిపిస్తున్నాయి.

చెవర్లే ట్రైల్‌బ్లేజర్ ప్రస్తుతం జనరల్ మోటార్స్ భారత మార్కెట్లో అందిస్తున్న చెవర్లే కాప్టివా ఎస్‌యూవీ కన్నా పెద్దదిగా ఉండనుంది. కొత్త 2012 ట్రైల్‌బ్లేజర్ ఎస్‌యూవీ 2.5 లీటర్ 2.8 లీటర్ డ్యురామ్యాక్స్ డీజిల్ ఇంజన్‌ ఆప్షన్లలో లభ్యమవుతుంది. 2.5 లీటర్ ఇంజన్ 150 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని, 350 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగా, 2.8 లీటర్ ఇంజన్ 180 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని, 480 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది.

ఇది టూ-వీల్ మరియు ఫోర్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌లతో 5-స్పీడ్ మ్యాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌లతో లభ్యమవుతుంది. ఇండియా 7-సీటర్ ట్రైల్‌బ్లజర్ ఎస్‌యూవీ ధర కాప్టివా ఎస్‌యూవీ కన్నా తక్కువగా (రూ.17 లక్షలకు దిగువన) ఉండొచ్చని అంచనా. టొయోటా ఫార్చ్యూనర్, ఫోర్డ్ ఎండీవియర్ వంటి ఎస్‌యూవీలకు పోటీగా చెవర్లే ట్రైల్ బ్లేజర్ నిలువనుంది.

More from DriveSpark

Article Published On: Saturday, March 24, 2012, 16:54 [IST]
English summary
American carmaker Chevrolet has launched its new Trailblazer SUV in Thailand. The new SUV is expected to go on sale worldwide with chances of it coming to the Indian market in the future, although no communication has been made from the carmaker's part in this regard.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+