ఆల్టో, ఇయాన్‌లకు పోటీగా ఫోర్డ్ స్మాల్ కార్
ఫోర్డ్ ఇండియా భారత మార్కెట్లో విడుదల చేయనున్న ఈ చిన్న కారు ఈ సెగ్మెంట్లోని మారుతి సుజుకి ఆల్టో, హ్యుందాయ్ ఇయాన్ వంటి మోడళ్లకు గట్టి పోటీగా నిలువనుంది. అంతేకాకుండా, ఫిగోకు ఎగువన మరో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ "ఫోర్డ్ ఫోకస్"ను కూడా ఫోర్డ్ దేశీయ విపణిలో విడుదల చేయనుంది.
మరోవైపు ఈ ఏడాది చివరి నాటికి లేదా వచ్చే ఏడాది ఆరంభంలో ఫోర్డ్ తాజాగా అభివృద్ధి చేసిన కాంపాక్ట్ ఎస్‌యూవీ ఎకోస్పోర్ట్ కూడా మార్కెట్లోకి రానున్న సంగతి తెలిసిందే. ఇవ్నీ ఫోర్డ్ ఇండియా దేశీయ మార్కెట్లో 2015 నాటికి ఆరు కొత్త ఉత్పత్తులను విడుదల చేయాలని రూపొందించిన ప్రణాళికలో భాగమైనవి.
గడచిన ఆర్థిక సంవత్సరం (2011-12)లో ఫోర్డ్ ఇండియా దేశీయ మార్కెట్లో 92,748 యూనిట్లను విక్రయించి, 3.2 శాతం మార్కెట్ వాటాను దక్కించుకుంది. ఈ మొత్తం అమ్మకాలలో సుమారు 75 శాతం ఫిగో మోడల్ కార్లే ఉన్నాయి. దీంతో చిన్న కార్ మార్కెట్లో అమ్మకాలు పెంచుకోవటం ద్వారా మార్కెట్ వాటాను కూడా పెంచుకోవాలని ఫోర్డ్ ఇండియా నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఫోర్డ్ ఫిగో దిగువమన మరో చిన్న కారు మార్కెట్లోకి విడుదల చేయాలని ఫోర్డ్ యోచిస్తోంది.


Click it and Unblock the Notifications









