లాంబోర్గినీ కార్లతో అనీల్, అజయ్ రేస్: విన్నర్ ఎవరు..?

ఇద్దురు బాలీవుడ్ హీరో ఒకరితో ఒకరు కలబడితే ఎలా ఉంటుంది..? రచ్చ రచ్చే కదూ..! బాలీవుడ్ 'నాయక్' అనీల్ కపూర్, 'సింఘం' అజయ్ దేవగన్‌లు చాలా సీరియస్‌గా ఓ పందెం వేసుకున్నారు. ఈ ఇద్దరు స్టార్ హీరోలకు ఫాస్ట్‌గా వెళ్లే కార్లంటే భలే క్రేజ్. ఇద్దరి వద్ద లాంబోర్గినీ సూపర్ కార్లు కూడా ఉన్నాయి. ఓ రోజు సరదా సరదాగా సాగిన వీరి మాటలు చివరకు కార్లపైకు మళ్లి రేస్ వరకూ దారి తీశాయి.

ఇంకేముంది.. వీరిద్దరి కార్ రేస్‌కు ఇటీవల ఫార్ములా వన్ రేస్‌కు ఆతిధ్యమిచ్చిన బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ (బిఐసి)ను వేదికగా ఎంచుకున్నారు. అజయ్ దేవగన్ తన తెలుపు రంగు లాంబోర్గినీ ఎల్‌పి 550-4 సూపర్ కారును, అనీల్ కపూర్ తన పసుపు రంగు లాంబోర్గినీ ఎల్‌పి 550-4 సూపర్ కారును బిఐసి ట్రాక్‌పై తీసుకువచ్చి జయ్ జయ్ మని కార్లతో రేస్ మొదలు పెట్టారు.


తొలుత వీరిద్దరూ ట్రాక్‌ను పరీక్షించేందుకు ఓ రౌండ్ అలా అలా ఓ చుట్టి వచ్చారు. 5.14 కి.మీ. పొడవునున్న ఈ ట్రాక్‌పై ఒకానొక పాయింట్ వద్ద అనీల్‌ను అజయ్ ఓవర్‌టేక్ చేయగా మరొక పాయింట్ వద్ద అజయ్‌ను అనీల్ ఓవర్‌టేక్ చేశాడు. దాదాపు 260 కి.మీ. స్పీడ్‌తో వారు తమ కార్లను పరుగులు పెట్టిస్తుంటే చూసే వీక్షకులకంతా అక్కడేదో ప్రపంచ కప్ కోసం సీరియస్ గ్రాండ్ ప్రి రేస్ జరుగుతున్న అనుభూతిని పొందారు.

వీరిద్దరూ మొత్తం నాలుగు ల్యాప్‌లు (ట్రాక్ చుట్టూ నాలుగు రౌండ్లు) చుట్టారు. మరి చివరిగా ఈ రేస్‌లో ఎవరు గెలిచారు, అనీల్ కపూర్ లేక అజయ్ దేవగన్..? అంటే, ఈ రేస్‌లో ఎవరు గెలవలేదు. ఇది కేవలం నేడు (శుక్రవారం) రిలీజ్ కాబోతున్న తమ కొత్త చిత్రం 'తేజ్' (Tezz) ప్రమోషన్‌లో భాగంగా ఆడియన్స్‌ను ఫూల్ చేసే ఓ పబ్లిసిట్ స్టంట్ మాత్రమే. ప్రియదర్శన్ దర్శకత్వం వహిస్తున్న 'తేజ్' సినిమాలో అజయ్ దేవగన్, అనీల్ కపూర్, జయిద్ ఖాన్‌లు కూడా అబ్బరపరచే యాక్షన్ సన్నివేశాలను చేశారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న సమీరా రెడ్డి కూడా స్టన్నింగ్ స్టంట్స్ చేసి ప్రేక్షకులను అలరించనుంది.

More from DriveSpark

Article Published On: Friday, April 27, 2012, 10:39 [IST]
English summary
Greater Noida's Buddh International Formula-1 Racing Circuit saw some glitz on Monday afternoon with Bollywood Stars Ajay Devgan and Anil Kapoor racing at the track. The two, who were in fact promoting their upcoming film 'Tezz' were seen riding their Lamborghini LP 550-4 cars.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+