2013 ఫోర్డ్ ఫియస్టా సెడాన్ ఆవిష్కరణ - ఫోటోలు
అమెరికన్ కార్ మేకర్ ఫోర్డ్ అందిస్తున్న ఫియస్టా సెడాన్‌లో మరో సరికొత్త రిఫ్రెష్డ్ వెర్షన్‌ను కంపెనీ గ్లోబల్ మార్కెట్‌కు పరిచయం చేసింది. ఇటీవలే బ్రెజిల్‌లో జరిగిన సావ్ పాలో ఆటో షోలో అమెరికన్ మార్కెట్ కోసం రూపొందించిన 2013 ఫోర్డ్ ఫియస్టా సెడాన్‌ను కంపెనీ ఆవిష్కరించింది. ప్రస్తుత ఫోర్డ్ ఫియస్టాతో పోల్చుకుంటే 2013 ఫోర్డ్ ఫియస్టాలో ఇంజన్ మొదలుకొని ఇంటీరియర్, ఎక్స్టీరియర్‌ల వరకూ అనేక మార్పులు చేర్పులు ఉన్నాయి.
అప్‌గ్రేడెడ్ 2013 ఫోర్డ్ ఫియస్టాలో అనేక అవార్డులను సొంతం చేసుకున్న 1.0 లీటర్ ఫోర్డ్ ఈకోబూస్ట్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ పరిమాణంలో చిన్నదిగా ఉండటమే కాకుండా, తక్కువ బరువును కలిగి ఉంటుంది. ఈ చిన్న 3 సిలిండర్, టర్బోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ తక్కువ డిస్‌ప్లేస్‌మెంట్ (సీసీ)ను కలిగి ఉన్నప్పటికీ, ఇది గరిష్టంగా 123 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ లీటరుకు 17 కిలోమీటర్ల మైలేజీని ఇవ్వొచ్చని అంచనా.
కొత్త ఫోర్డ్ ఫియస్టాలో సరికొత్త ఫ్రంట్ గ్రిల్, ఎయిర్-డ్యామ్స్, వీల్ అర్చెస్, ఫ్రంట్ బానెట్‌పై కనిపించే బాడీ లైన్స్ వంటి మార్పుల వల ఈ కారు మంచి స్పోర్టీ లుక్‌ను కలిగి ఉంటుంది. హెడ్‌ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్‌ను రీడిజైన్ చేశారు. అయితే సైడ్ ప్రొఫైల్‌లో మాత్రం పెద్దగా చెప్పుకోదగిన మార్పులు ఏవీ లేవు. సరికొత్త డిజైన్‌తో కూడిన అల్లాయ్ వీల్స్, కొద్దిగా మార్పు చేసిన వీల్ ఆర్చెస్‌లు చెప్పుకోదగిన మార్పులు. మొత్తమ్మీద సైడ్ నుంచి చూస్తే 2011 ఫియస్టాకు, 2013 ఫియస్టాకు పెద్దగా మార్పు అనిపించదు.

2013 ఫోర్డ్ ఫియస్టా సెడాన్

2013 ఫోర్డ్ ఫియస్టా సెడాన్

2013 ఫోర్డ్ ఫియస్టా సెడాన్

2013 ఫోర్డ్ ఫియస్టా సెడాన్

2013 ఫోర్డ్ ఫియస్టా సెడాన్

2013 ఫోర్డ్ ఫియస్టా సెడాన్

2013 ఫోర్డ్ ఫియస్టా సెడాన్

2013 ఫోర్డ్ ఫియస్టా సెడాన్

2013 ఫోర్డ్ ఫియస్టా సెడాన్

2013 ఫోర్డ్ ఫియస్టా సెడాన్

2013 ఫోర్డ్ ఫియస్టా సెడాన్

2013 ఫోర్డ్ ఫియస్టా సెడాన్

2013 ఫోర్డ్ ఫియస్టా సెడాన్

2013 ఫోర్డ్ ఫియస్టా సెడాన్

2013 ఫోర్డ్ ఫియస్టా సెడాన్

2013 ఫోర్డ్ ఫియస్టా సెడాన్

2013 ఫోర్డ్ ఫియస్టా సెడాన్

2013 ఫోర్డ్ ఫియస్టా సెడాన్

2013 ఫోర్డ్ ఫియస్టా సెడాన్

2013 ఫోర్డ్ ఫియస్టా సెడాన్
ఇక వెనుక వైపు డిజైన్ విషయానికి వస్తే, సరికొత్త టెయిల్ ల్యాంప్ క్లస్టర్, రీడిజైన్ చేయబడిన రియర్ బూట్ డోర్, రియర్ బంపర్‌లు చెప్పుకోదగినవి. ఇంకా ఇందులో, ఎలక్ట్రానికి స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ఈఎస్‌పి), ముందు వైపు డ్యూయెల్ స్టేజ్ ఎయిర్‌బ్యాగ్స్, డ్రైవర్ క్నీ ఎయిర్‌బ్యాగ్ (మోకాలు రక్షణ కోసం), అధనపు భద్రత కోసం సైడ్ ఇంపాక్ట్ అండ్ సైడ్ కర్టెన్ ఎయిర్‌బ్యాగ్స్ వంటి భద్రతా ఫీచర్లు ఈ కారు సొంతం. సురక్షితమైన మరియు సమర్థవంతమైన బ్రేకింగ్ కోసం ఇది ఈబిడి (ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్)తో కూడిన ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్)తో లభిస్తుంది.
ఇంకా, కారు దొంగతనానికి గురికాకుండా ఉండేందుకు రూపొందించిన యాంటీ-థెఫ్ట్ మెకానిజం, టైరులో గాలిని గుర్తించే టైర్ ప్రెజర్ మోనిటరింగ్ వంటివి అధనపు ఫీచర్లు. ఇన్ఫోటైన్‌మెంట్ మరియు కంఫర్ట్ ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో స్మార్టఫోన్లతో కారును అనుసంధానించేందుకు గాను ఫోర్ట్ సింగ్ టెక్నాలజీ, ఇన్‌బిల్ట్ నావిగేషన్ సిస్టమ్, మైకీ ప్రోగ్రామబల్ కీ ఫీచర్, బ్లూటూత్ కనెక్టివిటీ, ఇంటర్నెట్ రేడియో మొదలైనవి చెప్పుకోదగినవి. మరి ఈ కొత్త ఫోర్డ్ ఫియస్టా ఇండియన్ మార్కెట్‍కు వస్తుందో లేదో వేచి చూడాల్సి ఉంది.


Click it and Unblock the Notifications








