2013లో రానున్న హోండా సివిక్ డీజిల్; 27 kmpl మైలేజ్

By Ravi

జపాన్ ఆటో దిగ్గజం హోండా తమ తొలి డీజిల్ కారును సిద్ధం చేసింది. కంపెనీ అందిస్తున్న ప్రీమియం కారు సివిక్‌లో తొలిసారిగా డీజిల్ ఇంజన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. వచ్చే ఏడాది 2013 హోండా సివిక్ డీజిల్ కారు యూరప్ మార్కెట్లలో విడుదల కానుంది. హోండా అభివృద్ధి చేసిన 1.6 లీటర్ ఐ-డిటెక్ డీజిల్ ఇంజన్‌ను తొలిసారిగా 82వ అంతర్జాతీయ జెనీవా మోటార్‌ షోలో ప్రదర్శించిన సంగతి తెలిసిందే. ఈ ఇంజన్ మంచి పెర్ఫామెన్స్‌ను, పనితీరును కలిగి ఉండి తక్కువ కర్భన వ్యర్థాలను విడుదల చేయటమే కాకుండా, ఉత్తమ మైలేజ్‌ను కూడా ఆఫర్ చేస్తుందని హోండా పేర్కొంది.

హోండా సివిక్‌లో అమర్చనున్న అధునాతన 1.6 లీటర్ (1597సీసీ) ఐ-డిటెక్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 120 పిఎస్‌ల శక్తిని, 2,000 ఆర్‌పిఎమ్ వద్ద 300 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ ఇంజన్‌ను 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్ (గేర్‌ బాక్స్)తో జతచేయబడి ఉంటుంది. ఇది ప్రతి కిలోమీటరుకు 94 గ్రాముల కర్భన ఉద్ఘారాలను మాత్రమే విడుదల చేస్తుంది. జనవరి 2013లో సరికొత్త హోండా సివిక్ డీజిల్ కారును యూరప్ మార్కెట్లలో విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. అక్కడి మార్కెట్లో ఇది మూడు వేరియంట్లలో విడుదల కానుంది. అవి:

  • 2013 హోండా సివిక్ డీజిల్ ఎస్ఈ - 19,400 పౌండ్లు (సుమారు రూ.16.87 లక్షలు)
  • 2013 హోండా సివిక్ డీజిల్ ఈఎస్ - 20,595 పౌండ్లు (సుమారు రూ.17.91 లక్షలు)
  • 2013 హోండా సివిక్ డీజిల్ ఈఎక్స్ - 23,175 పౌండ్లు (సుమారు రూ.20.16 లక్షలు)

హోండా సివిక్ డీజిల్ - విడుదల

హోండా సివిక్ డీజిల్ - విడుదల

హోండా సివిక్ డీజిల్ వచ్చే ఏడాది జనవరి నెలలో కంపెనీ ముందుగా యూరోపియన్ మార్కెట్లలో విడుదల చేయనుంది

హోండా సివిక్ డీజిల్ - ఇంజన్

హోండా సివిక్ డీజిల్ - ఇంజన్

హోండా సివిక్‌లో అధునాతన 1.6 లీటర్ (1597సీసీ) ఐ-డిటెక్ డీజిల్ ఇంజన్‌ను అమర్చనున్నారు. ఇది గరిష్టంగా 120 పిఎస్‌ల శక్తిని, 300 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

హోండా సివిక్ డీజిల్ - ట్రాన్సిమిషన్

హోండా సివిక్ డీజిల్ - ట్రాన్సిమిషన్

హోండా సివిక్ డీజిల్ వెర్షన్‌లో అమర్చిన 1.6 లీటర్ ఐ-డిటెక్ డీజిల్ ఇంజన్‌ 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్ (గేర్‌ బాక్స్)తో జతచేయబడి ఉంటుంది.

హోండా సివిక్ డీజిల్ - మైలేజ్

హోండా సివిక్ డీజిల్ - మైలేజ్

హోండా సివిక్‌లో ఉపయోగించిన అత్యాధునిక సాంకేతిక పరిక్షానంతో అభివృద్ధి చేసిన డీజిల్ ఇంజన్ కారణంగా ఇది మంచి మైలేజీని అందించనుంది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఇది ప్రతి లీటర్ డీజిల్‌కు 27.79 కిలోమీటర్ల మైలీజ్‌ను ఆఫర్ చేయనుంది.

హోండా సివిక్ డీజిల్ - సిఓ2

హోండా సివిక్ డీజిల్ - సిఓ2

హోండా సివిక్ డీజిల్ ప్రతి కిలోమీటరుకు 94 గ్రాముల కర్భన ఉద్ఘారాలను మాత్రమే విడుదల చేస్తుంది.

హోండా సివిక్ డీజిల్ - ధరలు

హోండా సివిక్ డీజిల్ - ధరలు

* 2013 హోండా సివిక్ డీజిల్ ఎస్ఈ - 19,400 పౌండ్లు (సుమారు రూ.16.87 లక్షలు)

* 2013 హోండా సివిక్ డీజిల్ ఈఎస్ - 20,595 పౌండ్లు (సుమారు రూ.17.91 లక్షలు)

* 2013 హోండా సివిక్ డీజిల్ ఈఎక్స్ - 23,175 పౌండ్లు (సుమారు రూ.20.16 లక్షలు)

More from DriveSpark

Article Published On: Thursday, November 8, 2012, 15:51 [IST]
English summary
Japanese carmaker Honda will launch its first diesel powered car in 2013. The all new 2013 Honda Civic will be equipped with 1.6 liter i- DTEC engine. This engine features a 6-speed manual gearbox and has an exact capacity of 1597cc and in the Civic offers a maximum power output of 120PS at 4,000rpm while maximum torque is 300Nm at 2,000rpm. The new variant will be available in three generously equipped trim levels. Prices will start at a very competitive £19,400 for the SE model, £20,595 for the ES and £23,175 for the top-of-the-range EX.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+