2012 సుజుకి జిమ్నీ కాంపాక్ట్ ఎస్‌యూవీ - ఫోటోలు
మారుతి సుజుకి మాతృ సంస్థ, జపాన్‌కు చెందిన సుజుకి మోటార్ కార్పోరేషన్ అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తున్న ఫోర్-వీల్ డ్రైవ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ 'సుజుకి జిమ్నీ' (ఇండియన్ మార్కెట్లో మారుతి సుజుకి జిప్సీ)కు కంపెనీ కొత్త మెరుగులు అద్దింది. 2013 సుజుకి జిమ్నీలో డిజైన్ పరంగా, ఫీచర్ల పరంగా అనేక మార్పులు చేర్పులు చేసి కంపెనీ తాజాగా గ్లోబల్ మార్కెట్ల కోసం ప్రవేశపెట్టింది. చైనా మార్కెట్లో సుజుకి జిమ్నీ కాంపాక్ట్ ఎస్‌యూవీకి మంచి డిమాండ్ ఉంది.
సుజుకి జిమ్నీతో పోల్చుకుంటే కొత్త 2013 సుజుకి జిమ్నీలో రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ బంపర్, గ్రిల్, బానెట్, రీపొజిషన్ చేయబడిన ఫాగ్ ల్యాంప్స్ వంటి మార్పులను గమనించవచ్చు. ఎస్‌జెడ్4 వేరియంట్‌లో ఆప్షనల్ మెటాలిక్ రేంజ్ పెయింట్స్‌ను కొనుగోలుదారులు ఎంచుకోవచ్చు. ఇంటీరియర్లలో సరికొత్త ఫ్యాబ్రిక్ మెటీరియల్‌తో తయారు చేశారు. ఐఎస్ఓఫిక్స్ చైల్డ్ సీట్ మౌంటిగ్స్ ఇందులో మరొక ప్రధాన ఆకర్షణగా చెప్పుకోవచ్చు. ఎస్‌జెడ్3, ఎస్‌జెడ్4 వేరియంట్లలో సరికొత్త హెడ్‌రెస్ట్‌లను ఏర్పాటు చేశారు.
సుజుకి జిమ్నీ కాంపాక్ట్ ఎస్‌యూవీ మంచి ఆఫ్-రోడింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది అర్బన్ డ్రైవింగ్ కండిషన్స్‌కు కూడా చక్కగా సరిపోతుంది. సుజుకి జిమ్నీలో 1.6 లీటర్, 16-వాల్వ్ ఇంజన్‌ను ఉఫయోగించారు. ఇది గరిష్టంగా 85 పిఎస్‌ల శక్తిని, 110 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్‌తో లభ్యమవుతుంది. మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ వేరియంట్ లీటరుకు 14.09 కి.మీ. మైలేజీని, ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ వేరియంట్ లీటరుకు 13.70 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుంది.

సుజుకి జిమ్నీ 2013 - ఫ్రంట్ వ్యూ

సుజుకి జిమ్నీ 2013 - రియర్ వ్యూ

సుజుకి జిమ్నీ 2013 - సైడ్ వ్యూ

సుజుకి జిమ్నీ 2013 - ఇంటీరియర్ వ్యూ

సుజుకి జిమ్నీ 2013 - ఆఫ్-రోడింగ్

సుజుకి జిమ్నీ 2013 - ఆఫ్-రోడింగ్

సుజుకి జిమ్నీ 2013 - ఆఫ్-రోడింగ్

సుజుకి జిమ్నీ 2013 - అర్బన్ డ్రైవింగ్

సుజుకి జిమ్నీ 2013 - ఆఫ్-రోడింగ్

సుజుకి జిమ్నీ 2013 - ఆఫ్-రోడింగ్

సుజుకి జిమ్నీ 2013 - ఆఫ్-రోడింగ్

సుజుకి జిమ్నీ 2013 - ఇంటీరియర్

సుజుకి జిమ్నీ 2013 - ఆఫ్-రోడింగ్

సుజుకి జిమ్నీ 2013 - ఫేస్-లిఫ్ట్
ఇండియన్ మార్కెట్లో లభ్యమవుతున్న మారుతి సుజుకి జిప్సీకి స్టయిలిష్ వెర్షనే సుజుకి జిమ్నీ. భారత మార్కెట్లో ఒకప్పుడు ది బెస్ట్ ఆఫ్ రోడర్‌గా మిలటరీ వెహికల్‌గా, పోలీస్ జీపుగా మంచి పేరు తెచ్చుకున్న జిప్సీ ఎస్‌యూవీకి ప్రస్తుతం ఆదరణ తగ్గిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మార్కెట్లో సరికొత్త ఎస్‌యూవీలు సరసమైన ధరలకే లభ్యమవుతుండటంతో జిప్సీని కొనుగోలు చేసేవారు కరువయ్యారు. వాస్తవానికి మారుతి సుజుకి ఎస్‌యూవీ మార్కెట్లో ఎదురవుతున్న పోటీని తట్టుకోవాలంటే సుజుకి జిమ్నీ లాంటి అధునాతన ఉత్పత్తులను ఇక్కడి మార్కెట్లో ప్రవేశపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అయితే, సుజుకి జిమ్నీ ఇండియన్ మార్కెట్లో విడుదల చేసే అంశంపై కంపెనీ నోరు మెదపటం లేదు. చైనా మార్కెట్లో సుజుకి జిమ్నీ ఎస్‌యూవీ ధరలు రూ.12.2 లక్షల నుంచి రూ.13.6 లక్షల రేంజ్‌లో ఉన్నాయి. ఇదిలా ఉండగా, భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లను దృష్టిలో ఉంచుకొని డిజైన్ సుజుకి ఓ గ్లోబల్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కాన్సెప్ట్ 'మారుతి సుజుకి ఎక్స్ఏ ఆల్ఫా'ను గడచిన జనవరిలో జరిగిన 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన సంగతి తెలిసిందే. అప్‌గ్రేడెడ్ జిప్సీ స్థానంలో సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీని మారుతి సుజుకి ఇండియాకు పరిచయం చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








