టాటా నానోకు పోటీగా నిస్సాన్ డ్యాట్సన్ చీప్ కార్లు

జపాన్ ఆటోమొబైల్ కంపెనీ నిస్సాన్ మోటార్ కార్పోరేషన్ ఇటీవలే తమ పురాతన బ్రాండ్ డ్యాట్సన్‌ను తిరిగి మార్కెట్లో ప్రవేశపెట్టనున్నామని, డ్యాట్సన్ బ్రాండ్ నుండి చవక కార్లను తయారు చేసి భారత్, రష్యా వంటి ఎదుగుతున్న మార్కెట్లలో ప్రవేశపెట్టనున్నామని పేర్కొన్న సంగతి తెలిసిందే. సుమారు రూ.2,500 డాలర్ల ఖరీదు (సుమారు రూ.1.25 లక్షలు)తో డ్యాట్సన్ బ్రాండ్ క్రింది కార్లను అందించనున్నామని నిస్సాన్ ప్రకటించింది.

దీన్ని బట్టి చూస్తుంటే దేశీయ మార్కెట్లో టాటా మోటార్స్ అందిస్తున్న చవక కారు నానోను టార్గెట్ చేస్తూ డ్యాట్సన్ బ్రాండ్ పేరుతో నిస్సాన్ చీప్ కార్లను ఇండియన్ మార్కెట్లోకి తీసుకువచ్చి ధరల యుద్ధానికి మరింత ఆజ్యం పోయనున్నట్లు తెలుస్తోంది.

నిస్సాన్ కోసం బజాజ్ ఆటో రూపొందించిన లో-కాస్ట్ కార్ పట్ల నిస్సాన్ అసంతృప్తి చెందిన కారణంగా డ్యాట్సన్ చీప్ కార్ బ్రాండ్ తిరిగి మార్కెట్లోకి తీకువచ్చిందనే వాదనలు కూడా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ, నిస్సాన్ భారత మార్కెట్లో భారీ మార్కెట్ వాటాను ఆర్జించాలని యోచిస్తోంది. ఇందుకు డ్యాట్సన్ చీప్ కార్ బ్రాండ్‌ను కంపెనీ అస్త్రంగా ఎంచుకుంది.

ప్రస్తుతం భారత మార్కెట్లో లో-కాస్ట్ కార్ సెగ్మెంట్ పరిమాణం నానాటికి పెరుగుతూ వస్తుంది. ఇటీవలి నెలలో గమనిస్తే టాటా నానో కారు అమ్మకాలు కూడా జోరందుకున్నాయి. అయితే, టాటా మోటార్స్ ఆశించిన స్థాయిలో మాత్రం ఇవి జరగటం లేదు. డ్యాట్సన్ గనుక మాట మీద నిలబడి, తాము చెప్పిన ధర శ్రేణిలోనే చవక కార్లను ప్రవేశపెట్టినట్లయితే నానో పని గోవిందా..!!

More from DriveSpark

Article Published On: Wednesday, April 25, 2012, 17:37 [IST]
English summary
Japanese carmaker Nissan's low cost car brand which was launched earlier this year is making the right noises. Recent reports indicate its is aiming squarely at the world's cheapest car Tata Nano. Nissan has stated that it wants to build a car that costs about $2,500 (Rs.1.25 Lakhs) from Datsun.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+