ఏప్రిల్ నుండి వాహన బీమా మరింత ప్రియం
ఇకపై వాహన బీమా కొనుగోలు చేయాలంటే వాహన చోదకులు మరింత అదనపు రుక్కాన్ని చెల్లించక తప్పదు. రానున్న ఏప్రిల్ నెల నుండి మోటార్ ఇన్సూరెన్స్ ప్రీమియం ధరలు భారీగా పెరగనున్నాయి. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుండి థర్డ్ పార్టీ వాహన బీమాలను పెంచాలని బీమా నియంత్రణ అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏ) నిర్ణయించింది.
యాక్సిడెంట్క్లెయిమ్స్‌ను సెటిల్ చేసే ఇన్సూరెన్స్ కంపెనీల కామన్ పూల్, ఇండియన్ మోటార్ థర్డ్ పార్టీ పూల్ సిస్టమ్‌ను రద్దు చేయాలని ఐఆర్‌డీఏ నిర్ణయించింది. ఐఆర్‌డీఏ తీసుకోనున్న ఈ నిర్ణయంతో వాహన బీమా ధరలు 6 శాతం నుండి 40 శాతం వరకూ పెరగనున్నాయి. ఇది వాణిజ్య వాహనాలపై మరింత ఎక్కువ ప్రభావాన్ని చూపనుంది.
ఈ నిర్ణయం పట్ల బీమా కంపెనీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఐఆర్‌డీఏ తీసుకున్న నిర్ణయంతో తమ వ్యాపారం మరింత క్షీణించిపోయే ఆస్కారం ఉందని బీమా కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. "మార్చి 31, 2012 నుండి ప్రస్తుతం అమలులో ఉన్న ఇండియన్ మోటార్ థర్డ్ పార్టీ పూల్ సిస్టమ్‌ను రద్దు చేయాలని నిర్ణయించడమైనద"ని గతంలో ఐఆర్‌డీఏ ఓ ఆర్డర్‌ను జారీ చేసింది.


Click it and Unblock the Notifications









