'మినీ' గిన్నిస్ రికార్డ్: చిన్న కారులో 28 మంది అమ్మాయిలు

By Ravi

సాధారణంగా ఓ చిన్న హ్యాచ్‌బ్యాక్ కారులో ఎంత మందికి చోటు ఉంటుంది. సౌకర్యంగా కూర్చుంటే నలుగురు లేదా సర్దుకుని కూర్చుంటే 5-6 మందికి చోటు ఉంటుంది. కానీ జర్మన్ లగ్జరీ కార్ మేకర్ బిఎమ్‌డబ్ల్యూ అందిస్తున్న ప్రీమియం స్మాల్ కారులో మినీ హ్యాచ్‌బ్యాక్‌లో మాత్రం 28 మందికి చోటు దొరికింది. అలాగని ఇదేదో పొడవాటి కారు కాదండోయ్. ఇది సాధారణ 5-సీటర్ 2012 మినీ హ్యాచ్‌బ్యాక్ కారే. ఈ చిన్న కారులో ఏకంగా 28 మంది అందమైన అమ్మాయిలు చకచకా ఎక్కేసి ఈ సెగ్మెంట్లో ఇదివరకటి గిన్నిస్ వరల్డ్ రికార్డును బ్రేక్ చేశారు.

గతంలో ఇలాంటి ఓ మినీ కారులోనే 27 మంది ఎక్కి గిన్నిస్ వరల్డ్ రికార్డును స్థాపించగా, ఇప్పుడు 28 మంది ప్రయాణికులు ఎక్కి తమ పాత రికార్డును తామే బ్రేక్ చేశారు. లండన్‌లోని పోట్టర్స్ ఫీల్డ్ పార్కులో ఈస్ట్ సస్సెక్స్‌కు చెందిన 28 లింబర్ లేడీస్ (జిమ్నాస్టిక్ చేసేవాళ్లు) బృందం 2012 మినీ హ్యాచ్‌హ్యాక్‌లు ప్రతి ఇంచ్ స్థలాన్ని వినియోగించుకుని అందులో సర్దుకుపోయారు. సీట్లు, డ్యాష్‌బోర్డ్, ట్రంక్ (డిక్కీ) ఇలా కారులో ప్రతి ఖాలీ ప్రదేశాన్ని ఉపయోగించుకొని అందులో ఇరుక్కుపోయారు. కేవలం బూట్ స్పేస్‌లో నలుగురు అమ్మాయిలు సర్దుకు కూర్చున్నారు.

గతంలో ఫోక్స్‌వ్యాగన్ కూడా ఈ తరహా రికార్డును స్థాపించిన సంగతి తెలిసిందే. ఫోక్స్‌వ్యాగన్ అందిస్తున్న చిన్న కారు 'అప్‌' ఏకంగా 16 మందికి చోటు కల్పించి ఓ రికార్డును సృష్టించింది. అయితే మినీ కారు రికార్డుతో పోల్చుకుంటే అప్ కారు రికార్డు పెద్ద గొప్పేమీ కాదని చెప్పుకోవచ్చు. మీరేమంటారు..?

2012 మినీ - గిన్నిస్ వరల్డ్ రికార్డ్

2012 మినీ - గిన్నిస్ వరల్డ్ రికార్డ్

మినీ కారులో 5 మందికి మాత్రమే చోటు ఉంటుంది. కానీ లండన్‌లో ఈ కారులో 28 మంది అమ్మాయిలు ఎక్కి గిన్నిస్ రికార్డు బ్రేక్ చేశారు.

2012 మినీ - గిన్నిస్ వరల్డ్ రికార్డ్

2012 మినీ - గిన్నిస్ వరల్డ్ రికార్డ్

లండన్‌లోని పోట్టర్స్ ఫీల్డ్ పార్కులో ఈస్ట్ సస్సెక్స్‌కు చెందిన 28 లింబర్ లేడీస్ (జిమ్నాస్టిక్ చేసేవాళ్లు) బృందం 2012 మినీ హ్యాచ్‌హ్యాక్‌లు ప్రతి ఇంచ్ స్థలాన్ని వినియోగించుకుని అందులో సర్దుకుపోయారు.

2012 మినీ - గిన్నిస్ వరల్డ్ రికార్డ్

2012 మినీ - గిన్నిస్ వరల్డ్ రికార్డ్

మినీ కారులోని సీట్లు, డ్యాష్‌బోర్డ్, ట్రంక్ (డిక్కీ) ఇలా కారులో ప్రతి ఖాలీ ప్రదేశాన్ని ఉపయోగించుకొని అందులో ఇరుక్కుపోయారు. కేవలం బూట్ స్పేస్‌లో నలుగురు అమ్మాయిలు సర్దుకు కూర్చున్నారు.

2012 మినీ - గిన్నిస్ వరల్డ్ రికార్డ్

2012 మినీ - గిన్నిస్ వరల్డ్ రికార్డ్

ఈ కారులో ఎక్కిన అమ్మాయిలంతా జిమ్నాస్టిక్స్‌లో ప్రావీణ్యం పొందిన వారు.

2012 మినీ - గిన్నిస్ వరల్డ్ రికార్డ్

2012 మినీ - గిన్నిస్ వరల్డ్ రికార్డ్

గతంలో ఇలాంటి ఓ మినీ కారులోనే 27 మంది ఎక్కి గిన్నిస్ వరల్డ్ రికార్డును స్థాపించగా, ఇప్పుడు 28 మంది ప్రయాణికులు ఎక్కి తమ పాత రికార్డును తామే బ్రేక్ చేశారు.

ఫోక్స్‌వ్యాగన్ అప్ రికార్డ్

ఫోక్స్‌వ్యాగన్ అప్ రికార్డ్

గతంలో ఫోక్స్‌వ్యాగన్ కూడా ఈ తరహా రికార్డును స్థాపించిన సంగతి తెలిసిందే. ఫోక్స్‌వ్యాగన్ అందిస్తున్న చిన్న కారు 'అప్‌' ఏకంగా 16 మందికి చోటు కల్పించి ఓ రికార్డును సృష్టించింది.

More from DriveSpark

Article Published On: Friday, November 16, 2012, 18:10 [IST]
English summary
The 2012 Mini hatchback might be a small car and yet as many as 28 people were able to get inside it in UK. A team of 28 gymnasts managed to cram in the small car. The ladies set a Guinness World Record for the number of people inside a 2012 Mini, breaking their previous Guinness world record of 27.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+