భారతదేశంలో అత్యంత ఖరీదైన ఐదు కార్లు

విలాసమవంతమైన కార్లు చవగా రావు. 'పిండి కొద్ది రొట్టె' అన్న చందంగా, వెచ్చించే డబ్బును బట్టి లగ్జరీ కార్లు అందుబాటులో ఉంటాయి. మన దేశంలో కూడా కోట్ల ఖరీదు చేసే లగ్జరీ కార్లను కొనుగోలు చేసే ధనికులు కూడా ఉన్నారు. సరే, ఇదంతా అటుంచితే మన భారత ఆటోమొబైల్ మార్కెట్లో లభ్యమవుతున్న ఐదు అత్యంత ఖరీదైన కార్ల గురించి ఈ ఫోటో ఫీచర్ కథనంలో తెలుసుకుందాం రండి..!

క్ర. సం. మోడల్ ధర
1 ఆస్టన్ మార్టిన్ వన్ 77 రూ.20 కోట్లు
2 బుగాటి వేరాన్ గ్రాండ్ స్పోర్ట్ రూ.16 కోట్లు
3 కొయినిగ్‌సెగ్ అగెరా రూ.12.5 కోట్లు
4 ఆస్టన్ మార్టిన్ వి12 జగాటో రూ.6.5 కోట్లు
5 గంపెర్ట్ అపోలో రూ.5 కోట్లు

రూ.20 కోట్లు

రూ.20 కోట్లు

భారత మార్కెట్లో లభిస్తున్న అత్యంత కార్లలో మొదటిది ఆస్టన్ మార్టిన్ వన్ 77. గడచిన 2008లో జరిగిన ప్యారిస్ మోటార్ షోలో ఆస్టన్ మార్టిన్ ఈ 2-డోర్ స్పోర్ట్స్ కూపేను ఆవిష్కరించింది. పేరుకు తగినట్లుగా కేవలం 77 కార్లను మాత్రమే కంపెనీ తయారు చేసింది. ఇందులో అత్యంత శక్తివంతమైన 7.3 లీటర్, వి12 ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 750 బిహెచ్‌పిల శక్తిని, 750 ఎన్‌మ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది.

ఆస్టన్ మార్టిన్ వన్ 77 కేవలం 3.5 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 357 కి.మీ.

రూ.16 కోట్లు

రూ.16 కోట్లు

ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరుగులు పెట్టే కార్లలో ఒకటి "బుగాటి వేరాన్" కూడా ఒకటి. అత్యంత శక్తివంతమైన ఇంజన్ కలిగిన బుగాటి వేరాన్ 16.4 గ్రాండ్ స్పోర్ట్ కేవలం 2.5 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 407 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. భారత మార్కెట్లో బుగాటి వేరాన్ 16.4 గ్రాండ్ స్పోర్ట్ సూపర్ కారు ధర సుమారు రూ.16 కోట్లకు పైమాటే.

రూ.12.5 కోట్లు

రూ.12.5 కోట్లు

దేశీయ విపణిలో స్వీడన్‌కు చెందిన కోయినిగ్‌సెగ్ అందిస్తున్న సూపర్ కారు "కోయినిగ్‌సెగ్ అగెరా" మరొక అత్యంత ఖరీదన కారు. గరిష్టంగా గంటకు 435 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ సూపర్ కారు కేవలం 2.9 సెకన్లలో 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. కోయినిగ్‌సెగ్ అగెరా కారులో ఉపయోగించిన 5 లీటర్ బై-టర్బో వీ8 ఇంజన్‌ గరిష్టంగా 1,115 హర్స్‌పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. భారత మార్కెట్లో కోయినిగ్‌సెగ్ అగెరా సూపర్ కారు ధర సుమారు రూ.12.5 కోట్లకు పైమాటే.

రూ.6.5 కోట్లు

రూ.6.5 కోట్లు

ఇండియాలో ఆస్టన్ మార్టిన్ అందిస్తున్న మరొక ఖరీదన కారు 'ఆస్టన్ మార్టిన్ వి12 జగాటో' భారత మార్కెట్లో ఆస్టన్ మార్టిన్ వి12 జగాటో సూపర్ కారు ధర సుమారు రూ.6.5 కోట్లకు పైమాటే. ఇందులో ఉపయోగించిన 6.0 లీటర్ వి12 ఇంజన్ గరిష్టంగా 510 బిహెచ్‌పిల శక్తిని, 570 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

రూ.5 కోట్లు

రూ.5 కోట్లు

జర్మనీకు చెందిన సూపర్ కార్ కంపెనీ గంపెర్ట్ అందిస్తున్న పవర్‌ఫుల్ సూపర్ కారు 'గంపెర్ట్ అపోలో'. ఇందులో 1.4 లీటర్ టర్బోఛార్జ్‌డ్ వి8 ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది మూడు వెర్షన్లలో (బేస్ వెర్షన్ 641 బిహెచ్‌పి, స్పోర్ట్ వెర్షన్ 690 బిహెచ్‌పి, రేస్ వెర్షన్ 789 బిహెచ్‌పి) లభిస్తుంది. ఇది గరిష్టంగా 360.4 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది. గంపెర్ట్ అపోలో కేవలం 3.1 సెకండ్లలోనే 0-100 కి.మీ వేగంతో పరుగులు పెడుతుంది.

ఆస్టన్ మార్టిన్ వన్ 77
భారత మార్కెట్లో లభిస్తున్న అత్యంత కార్లలో మొదటిది ఆస్టన్ మార్టిన్ వన్ 77. గడచిన 2008లో జరిగిన ప్యారిస్ మోటార్ షోలో ఆస్టన్ మార్టిన్ ఈ 2-డోర్ స్పోర్ట్స్ కూపేను ఆవిష్కరించింది. పేరుకు తగినట్లుగా కేవలం 77 కార్లను మాత్రమే కంపెనీ తయారు చేసింది. ఇందులో అత్యంత శక్తివంతమైన 7.3 లీటర్, వి12 ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 750 బిహెచ్‌పిల శక్తిని, 750 ఎన్‌మ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది.

ఆస్టన్ మార్టిన్ వన్ 77 కేవలం 3.5 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 357 కి.మీ. ఈ కారు బరువు తక్కువగా ఉంచేందుకు గానూ దీని బాడీని తేలికపాటి అల్యూమినియం, ధృడమైన కార్బన్‌ఫైబర్ మెటీరియల్స్‌తో తయారు చేశారు. దీని మొత్తం బరువు 1500 కిలోలు మాత్రమే. భారత మార్కెట్లో ఆస్టన్ మార్టిన్ వన్ 77 సూపర్ కారు ధర సుమారు రూ.20 కోట్లకు పైమాటే.

బుగాటి వేరాన్ గ్రాండ్ స్పోర్ట్
ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరుగులు పెట్టే కార్లలో ఒకటి "బుగాటి వేరాన్" కూడా ఒకటి. అత్యంత శక్తివంతమైన ఇంజన్ కలిగిన బుగాటి వేరాన్ 16.4 గ్రాండ్ స్పోర్ట్ కేవలం 2.5 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 407 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. భారత మార్కెట్లో బుగాటి వేరాన్ 16.4 గ్రాండ్ స్పోర్ట్ సూపర్ కారు ధర సుమారు రూ.16 కోట్లకు పైమాటే.

కోయినిగ్‌సెగ్ అగెరా
దేశీయ విపణిలో స్వీడన్‌కు చెందిన కోయినిగ్‌సెగ్ అందిస్తున్న సూపర్ కారు "కోయినిగ్‌సెగ్ అగెరా" మరొక అత్యంత ఖరీదన కారు. గరిష్టంగా గంటకు 435 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ సూపర్ కారు కేవలం 2.9 సెకన్లలో 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. కోయినిగ్‌సెగ్ అగెరా కారులో ఉపయోగించిన 5 లీటర్ బై-టర్బో వీ8 ఇంజన్‌ గరిష్టంగా 1,115 హర్స్‌పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. భారత మార్కెట్లో కోయినిగ్‌సెగ్ అగెరా సూపర్ కారు ధర సుమారు రూ.12.5 కోట్లకు పైమాటే.

ఆస్టన్ మార్టిన్ వి12 జగాటో
ఇండియాలో ఆస్టన్ మార్టిన్ అందిస్తున్న మరొక ఖరీదన కారు 'ఆస్టన్ మార్టిన్ వి12 జగాటో' భారత మార్కెట్లో ఆస్టన్ మార్టిన్ వి12 జగాటో సూపర్ కారు ధర సుమారు రూ.6.5 కోట్లకు పైమాటే. ఇందులో ఉపయోగించిన 6.0 లీటర్ వి12 ఇంజన్ గరిష్టంగా 510 బిహెచ్‌పిల శక్తిని, 570 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

గంపెర్ట్ అపోలో
జర్మనీకు చెందిన సూపర్ కార్ కంపెనీ గంపెర్ట్ అందిస్తున్న పవర్‌ఫుల్ సూపర్ కారు 'గంపెర్ట్ అపోలో'. ఇందులో 1.4 లీటర్ టర్బోఛార్జ్‌డ్ వి8 ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది మూడు వెర్షన్లలో (బేస్ వెర్షన్ 641 బిహెచ్‌పి, స్పోర్ట్ వెర్షన్ 690 బిహెచ్‌పి, రేస్ వెర్షన్ 789 బిహెచ్‌పి) లభిస్తుంది. ఇది గరిష్టంగా 360.4 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది. గంపెర్ట్ అపోలో కేవలం 3.1 సెకండ్లలోనే 0-100 కి.మీ వేగంతో పరుగులు పెడుతుంది.

More from DriveSpark

Article Published On: Friday, September 14, 2012, 15:36 [IST]
English summary
Luxury comes at a price! There is a chunk of Indian car buyers who desire this luxury. Have you ever wondered, what are the most expensive cars in India? Luxury cars in India, are soon becoming a fashion rather than a desire. Drivespark breaks down this expensive fashion!
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+