రిఫ్రెష్డ్ మారుతి సుజుకి రిట్జ్‌ డీజిల్‌లో కొత్త ఫీచర్లు ఇవే..!

మారుతి సుజుకి ఇండియా సైలెంట్‌గా మార్కెట్లోకి విడుదల చేసిన అప్‌గ్రేడెడ్ రిట్జ్ హ్యాచ్‌బ్యాక్‌లో అనేక మార్పులు ఉన్నాయి. ఇదివరకటి రిట్జ్‌తో పోల్చుకుంటే కొత్త రిట్జ్‌లో మొత్తం 52 మార్పులు ఉన్నాయి. ప్రస్తుతానికి డీజిల్ వెర్షన్‌లో మాత్రమే విడుదలైన సరికొత్త మారుతి సుజుకి రిట్జ్ హ్యాచ్‌బ్యాక్‌లో చేసిన కొత్త మార్పులు, జోడించిన విశిష్ట ఫీచర్లు క్రింది విధంగా ఉన్నాయి.

* కొత్త డీజిల్ వెర్షన్ రిట్జ్‌ 10 శాతం మెరుగైన మైలేజ్ (23.1 కెఎమ్‌పిఎల్)ను ఆఫర్ చేస్తుంది
* ఇది కొత్త డ్యూయెల్ టోన్ ఇంటీరియర్స్‌తో లభిస్తుంది
* దీని ఫ్రంట్ డిజైన్ పూర్తిగా రీడిజైన్ చేయబడింది
* ఇందులో కొత్త జెడ్‌డిఐ (టాప్-ఎండ్) వేరియంట్‌ను పరిచయం చేయటం జరిగింది
* క్రోమ్ సుజుకి లోగోతో కూడిన సరికొత్త ఫ్రంట్ గ్రిల్
* స్టయిలిష్ హెడ్‌ల్యాంప్స్
* స్పోర్టీ రియర్ స్పాయిలర్
* బాడీ సైడ్ మౌల్డింగ్స్
* టాప్-ఎండ్ వేరియంట్‌ (జెడ్‌డిఐ)లో ఎయిర్‌బ్యాగ్స్, ఏబిఎస్, అల్లాయ్ వీల్స్, స్టీరింగ్‌పై ఆడియో కంట్రోల్స్ వంటి ఫీచర్లు
* మెరుపరచబడిన వెనుక సీటింగ్
* ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్‌పై మైలేజ్‌తో పాటుగా వివిధ వివరాలను తెలిపే మల్టీ ఇన్‌ఫర్మేషన్ డిస్‌ప్లే
* యూఎస్‌బి సపోర్టుతో కూడిన కొత్త ఆడియో సిస్టమ్
* యాంత్రికంగా సర్దుబాటు చేయగల సైడ్ మిర్రర్స్ (ఓవిఆర్ఎమ్)
* పగలు, రాత్రి ఉపయోగపడే డే అండ్ నైట్ సెంటర్ మిర్రర్ (ఐవిఆర్ఎమ్)
* మూడు సరికొత్త రంగులు (మిస్టిక్ రెడ్, గ్రానైట్ గ్రే, బ్రీజ్ బ్లూ)


మారుతి సుజుకి రిట్జ్ భారత మార్కెట్లో విడుదలైన 18 నెలల్లోనే 1,00,000 కార్లకు పైగా అమ్ముడుపోయి రికార్డు సృష్టించింది. మారుతి సుజుకి 37 నెలల్లో మొత్తం 2 లక్షల రిట్జ్ కార్లను విక్రయించింది. రిట్జ్‌కు ఫేస్‌బుక్‌లో ఇప్పటికే 10 లక్షలకు పైగా అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం అధిక వెయిటింగ్ పీరియడ్ ఉన్న మారుతి సుజుకి స్విఫ్ట్‌కు ప్రత్యామ్నాయ మోడల్ కోరుకునే వారికి సరికొత్త అప్‌గ్రేడెడ్ రిట్జ్ మంచి ఆప్షన్‌గా నిలువనుంది

మారుతి సుజుకి రిట్జ్‌లో ఉపయోగించిన 1248 డిడిఐఎస్ ఇంజన్ గరిష్టంగా 75 పిఎస్‌ల శక్తిని, 190 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్టెప్ మల్టీ ఇంజెక్షన్ టెక్నాలజీ కలిగిన ఈ ఇంజన్ సమర్థవంతంగా ఉండి స్మూత్ రన్నింగ్‌ను కలిగి ఉంటుంది. ఇది కేవలం 5.9 సెకండ్లలోనే 0-60 కి.మీ. మైలేజీని అందుకుంటుంది. మారుతి సుజుకి రిట్జ్ డీజిల్ మొత్తం నాలుగు వేరియంట్లలో లభ్యమవుతుంది. వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

* మారుతి సుజుకి రిట్జ్‌ ఎల్‌డిఐ - రూ. 5.31 లక్షలు
* మారుతి సుజుకి రిట్జ్‌ విడిఐ - రూ. 5.64 లక్షలు
* మారుతి సుజుకి రిట్జ్‌ విడిఐ (ఏబిఎస్) - రూ. 5.82 లక్షలు
* మారుతి సుజుకి రిట్జ్‌ జెడ్‌డిఐ - రూ. 6.23 లక్షలు

More from DriveSpark

Article Published On: Tuesday, September 4, 2012, 19:10 [IST]
English summary
The refreshed Ritz Diesel is packed with 52 exciting changes such as new front design, new dual tone interiors, new ZDi variant, multi-information display on instrument panel, new audio system with USB, electrically adjustable rear view mirrors and body side moulding.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+