వేలాని అతి పురాతన రోల్స్ రాయిస్ లగ్జరీ కారు
ఈ స్టన్నింగ్ రోల్స్ రాయిస్ లగ్జరీ కారును 1911లో తయారు చేసారు. అప్పట్లో దీని ధర ఒక సగటు ఉద్యోగి వార్షిక సంపాధన (1500 పౌండ్లు) కన్నా పది రెట్లు ఎక్కువ. ఇదే డబ్బుతో అప్పట్లో ఓ పెద్ద ఇంటిని కొనుగోలు చేయవచ్చని సమాచారం. హిస్టారిక్స్ అనే సంస్థ ఈ కారును సెప్టెంబర్ 1వ తేదీన బ్రూక్‌లాండ్స్‌లో వేలం వేస్తోంది. వేలంలో ఈ కారు 5,50,000 బ్రిటీష్ పౌండ్ల (రూ. 4.73 కోట్లు) వెల పలకవచ్చని అంచనా.
ఈ క్లాసిక్ మోడల్‌ను మొట్టమొదటిసారిగా 1906లో ప్రవేశపెట్టారు. 1907లో ప్రతిష్టాత్మకమైన ఆటోకార్ మ్యాగజైన్ దీన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ కారుగా పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం వేలానికి వచ్చిన ఈ రోల్స్ రాయిస్ కారును 1911లో సర్ అడాల్ఫ్ టక్ అనే ధనవంతుని కోసం ప్రత్యేకంగా తయారు చేశారు. అత్యుత్తమ నాణ్యత కలిగిన ఈ కారును ‘సిల్వర్ ఘోస్ట్' అని పిలిచే వారు.


Click it and Unblock the Notifications









