ఇకపై అంగవికలాంగులు సైతం కారు నడపొచ్చు: కొత్త టెక్నాలజీ

By Ravi

కాళ్లు లేనివారు కారు నడపటం సాధ్యమవుతుందా..? ముమ్మాటికి సాధ్యం కాదంటారా..! కానీ దీన్ని సాధ్యం చేసి చూపించాడు, తమిళనాడుకు చెందిన ఈ ఉదయ్ కుమార్. పోలియో వ్యాధితో మూడేళ్ల వయస్సులో అంగవైకల్యానికి గురైన ఉదయ్ కుమార్, తన లాంటి అంగవికలాంగులు సైతం కారు నడిపేలా ఓ సరికొత్త టెక్నాలజీని రూపొందించాడు. ఎలాంటి కారుకైనా సరే ఈ టెక్నాలజీని అమర్చుకోవచ్చు. దీనిని అమర్చుకోవటం వలన కాళ్లతో పనిలేకుండానే కారును నడిపవచ్చు అంటున్నాడు ఈ కుంభకోణం కుర్రాడు.

వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని కుంభకోణం ప్రాంతానికి చెందిన ఉదయ్ కుమార్ కేవలం చేతుల సాయంతోనే కారును నడిపేలా ఓ వ్యవస్థను రూపొందించాడు. కారు యాక్సిలరేటర్, బ్రేక్, క్లచ్ అన్ని కూడా స్టీరింగ్‌కు దిగువ భాగాన, బైక్ హ్యాండిల్ మాదిరిగా ఉండే ఓ హ్యాండిల్‌కు అమర్చాడు. దీనివలన ఈ మూడింటిని ఎడమ చేతితోనే ఆపరేట్ చేయవచ్చు. ఇకపోతే కుడి చేతితో కేవలం స్టీరింగ్‌ను బ్యాలెన్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కాళ్లతో పనిలేకుండా సింపుల్‌గా కారును కంట్రోల్ చేయటం వీలవుతుంది.

సాధారణ బ్రేక్ స్థానంలో ఇందులో పవర్ బ్రేక్‌ను అమర్చటం జరిగింది. బ్రేక్‌ను కొద్దిగా నొక్కితేనే కారు నిలిచిపోతుంది. ఈ టెక్నాలజీకు ఇప్పటికే ఐఐటి నుంచి ఆమోదం కూడా లభించింది. ఈ ఫార్ములాను తమకు చెప్పాల్సిందిగా ఇప్పటికే పలు కార్ కంపెనీలు తను సంప్రదించాయని ఉదయ్ చెప్పుకొచ్చాడు. ఇలా కారును మోడిఫై చేసినందుకు చిన్న కార్లయితే రూ.58,000 అదే పెద్ద కార్లయితే రూ.80,000 వరకూ ఛార్జ్ చేస్తామని, అంతేకాకుండా ఇలా చేసినందుకు ఫిట్టింగ్ ఛార్జీలు తీసుకోమని, కేవలం స్పేర్ ఖర్చులు మాత్రమే వసూలు చేస్తామని ఆయన చెప్పాడు.

ఉదయ్ కుమార్

ఉదయ్ కుమార్

వికలాంగుల కోసం తాను రూపొందించిన టెక్నాలజీని ప్రదర్శిస్తున్న ఉదయ్ కుమార్.

వికలాంగుల కారు

వికలాంగుల కారు

కాళ్లు అవసరం లేకుండా యాక్సిలరేటర్, బ్రేక్, క్లచ్ అన్ని చేతులతోనే ఆపరేట్ చేయగల టెక్నాలజీ.

వికలాంగుల కారు

వికలాంగుల కారు

కారుకు టెక్నాలజీని ఫిట్ చేసే పనిలో నిమగ్నమై ఉన్న ఉదయ్ కుమార్.

వికలాంగుల కారు

వికలాంగుల కారు

వికలాంగుల కారు

వికలాంగుల కారు

More from DriveSpark

Article Published On: Tuesday, December 4, 2012, 15:29 [IST]
English summary
Uday Kumar a physically challenged car modifier from Kumbakonam, TN is known for his uniqueness. Being physically challenged he has not stopped his passion for driving. Uday Kumar has modified a car, that can suitable for Physically challenged drivers.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+