అరాధ్య బచ్చన్ మొదటి జన్మదిన కానుక - మినీ కూపర్ ఎస్
పుట్టుకతోనే జాక్‌పాట్ కొట్టేసిన అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యారాయ్ బచ్చన్‌ల ముద్దుల కూతురు ఆరాధ్య బచ్చన్ తన మొదటి పుట్టిన రోజున మరో ఖరీదైన కానుకను సొంతం చేసుకోనుంది. ఆరాధ్య బచ్చన్ రేపు తన మొదటి జన్మదినాన్ని జరుపుకోనుంది. ఈ నేపథ్యంలో కూతురి కోసం అభిషేక్ మరో విలాసవంతమైన కారును కొనుగోలు చేశాడు. జర్మనీకు చెందిన లగ్జరీ కార్ కంపెనీ అందిస్తున్న ప్రీమియం స్మాల్ కార్ బ్రాండ్ మినీ, భారత మార్కెట్లో ఆఫర్ చేస్తున్న 'మినీ కూపర్ ఎస్' మోడల్‌ను అభిషేక్ బచ్చన్ తన కూతురికి కానుకగా ఇవ్వనున్నాడు.
గతంలో ఆరాధ్య బచ్చన్ జన్మించినప్పుడు కూడా అభిషేక్ బచ్చన్ ఆమె కోసం కోటి రూపాయలకు పైగా ఖరీదు చేసే 'ఆడి ఏ8' లగ్జరీ కారును కానుకగా కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ మొదటి పుట్టిన రోజు నాడు ఆరాధ్యకు కానుకగా ఇవ్వటం కోసం రూ.28 లక్షల ఖరీదు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) మినీ కూపర్ ఎస్ చిన్న కారును అభిషేక్ కొనుగోలు చేశాడు. ఇదిగో ఈ ఫోటోలో చూడండి.. తన మనవరాలి కోసం కొనుగోలు చేసిన ఈ కారును అరాధ్య తాత, బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ నడుపుతుండగా కెమెరా క్లిక్‌మనిపించింది.

ఆరాధ్యా బచ్చన్
అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ బచ్చన్‌ల ముద్దుల కూతురు ఆరాధ్య బచ్చన్ తన మొదటి పుట్టిన రోజున మరో ఖరీదైన కానుకను సొంతం చేసుకోనుంది. ఆరాధ్య బచ్చన్ మొదటి జన్మదినాన్ని పురస్కరించుకొని మినీ ఇండియా అందిస్తున్న రూ.28 లక్షలు ఖరీదు చేసే 'మినీ కూపర్ ఎస్' కారును అభిషేక్ తన కూతురికి కానుకగా ఇవ్వనున్నాడు.

మినీ కూపర్ ఎస్ - అమితాబ్ బచ్చన్
తన మనవరాలు ఆరాధ్య బచ్చన్ కోసం కొనుగోలు మినీ కూపర్ ఎస్ లగ్జరీ కారును డెలవరీ తీసుకుంటున్న అరాధ్య తాత, బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్.

మినీ కూపర్ ఎస్
జర్మనీకు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ భారత మార్కెట్లో అందిస్తున్న లగ్జరీ స్మాల్ కార్ బ్రాండ్ మినీ. మినీ ఇండియా దేశీయ విపణిలో మూడు మోడళ్లను అందిస్తోంది. అందులో మినీ కూపర్ ఎంట్రీ లెవల్ మోడల్. రెండు డోర్లు మాత్రమే కలిగిన ఈ చిన్న కారులో నలుగురు ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు.

మినీ కూపర్ ఎస్ - ఇంజన్
మినీ కూపర్ ఎస్ కారులో 1.6 లీటర్ (1598సీసీ), 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను అమర్చారు. ఇది 5500 ఆర్‌పిఎమ్ వద్ద 184 హెచ్‌పిల గరిష్ట శక్తిని, 1600-5000 ఆర్‌పిఎమ్ వద్ద 240 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

మినీ కూపర్ ఎస్ - యాక్సిలరేషన్
మినీ కూపర్ ఎస్ కేవలం 7.2 సెకండ్లలోనే 0-10 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది.

మినీ కూపర్ ఎస్ - గరిష్ట వేగం
మినీ కూపర్ ఎస్ గరిష్టంగా గంటకు 223 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది.

మినీ కూపర్ ఎస్ - మైలేజ్
కేవలం 6.4 లీటర్ల పెట్రోల్‌తోనే 100 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని మినీ పేర్కొంది. అంటే ఇది లీటరు పెట్రోలుకు 15.6 కి.మీ. మైలేజీని (కంబైన్డ్) ఆఫర్ చేస్తుందన్నమాట.

మినీ కూపర్ ఎస్ - కర్భన ఉద్ఘారాలు
మినీ కూపర్ ఎస్ ప్రతి కిలోమీటరుకు 149 గ్రాముల కార్భన్ డైఆక్సైడ్‌ను విడుదల చేస్తుంది.

ఆరాధ్య బచ్చన్ - ఆడి ఏ8
గతంలో ఆరాధ్య బచ్చన్ జన్మించినప్పుడు కూడా తండ్రి అభిషేక్ బచ్చన్ ఓ ఆడి ఏ8 లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. అభిషేక్ కోసం ఆడి కంపెనీ ఈ కారును ప్రత్యేకంగా కస్టమైజ్ చేసి ఇచ్చింది.

అభిషేక్ బచ్చన్ - ఆడి ఏ8
తన కూతురు ఆరాధ్య బచ్చన్ కోసం బుక్ చేసిన ఆడి ఏ8 కారును డెలివరీ తీసుకుంటున్న అభిషేక్ బచ్చన్. ఆడి ఏ8 ఎల్ ప్రారంభ ధర రూ. 10,075,000 (ఎక్స్-షోరూమ్, మహారాష్ట్ర). ఆడి ఏ8 ఎల్ కారులో వి8 4.2 లీటర్ టిడిఐ క్యూ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 350 బిహెచ్‌పిల శక్తిని, 800 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 5.6 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది.

మినీ కూపర్ ఎస్ - ఇంటీరియర్స్

మినీ కూపర్ ఎస్ - ఫ్రంట్ ప్రొఫైల్

మినీ కూపర్ ఎస్ - రియర్ ప్రొఫైల్

మినీ కూపర్ ఎస్ - అల్లాయ్ వీల్స్

మినీ కూపర్ ఎస్ - హెడ్‌ల్యాంప్స్

మినీ కూపర్ ఎస్ - ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్



Click it and Unblock the Notifications








