ఆడి ఏ7 స్పోర్ట్‌బ్యాక్ కారులో సూర్య సరికొత్త సవారీ
ఇటు టాలీవుడ్‌లోను, అటు కోలీవుడ్‌లోనూ తనకంటూ ఓ ప్రత్యేక స్టార్‌డమ్‌ను సృష్టించుకున్న నటుడు 'సూర్య'ను జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ కూడా ఆడి గుర్తించింది. అందుకే.. ఆడి ఇండియా దేశీయ విపణిలో అందిస్తున్న అత్యంత ఖరీదైన కారు 'ఆడి ఏ7 స్పోర్ట్‌బ్యాక్' సూర్యకు బహుమతిగా ఇచ్చినట్లు పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
వాస్తవానికి ఇండియాలో అత్యంత ప్రాచుర్యం పొందిన సినీపరిశ్రమలోని సెలబ్రిటీలకు లగ్జరీ కార్ కంపెనీలు తమ ఉత్పత్తులను బహుమతిగా ఇచ్చి ఫ్రీగా పబ్లిసిటీని కొట్టేస్తుంటాయి. ఇదే తరహాలో ఆడి ఇండియా కూడా ఓ ఖరీదైన ఆడి ఏ7 స్పోర్ట్‌బ్యాక్ కారును సూర్యకు కానుక ఇచ్చినట్లు సమాచారం.
గతంలో మన 'గజని' ఓ ఆడి క్యూ7 ఎస్‌యూవీని కొనుగోలు చేశాడు. సూర్య ప్రస్తుతం ఈ ఆడి క్యూ7 ఎస్‌యూవీని తన తమ్ముడు కార్తీకి ఇచ్చేసినట్లు తెలుస్తోంది. పేరుకు తగినట్లుగానే ఆడి ఏ7 స్పోర్ట్‌బ్యాక్ మంచి స్పోర్టీయర్ పెర్ఫామెన్స్‌ను కలిగి ఉంటుంది. ఇండియన్ మార్కెట్లో ఆడి ఏ7 స్పోర్ట్‌బ్యాక్ కారు ధర సుమారు రూ.80 లక్షల వరకూ ఉంటుంది.
ఆడి ఏ7 కారులో ఉపయోగించిన 3-లీటర్ టిడిఐ క్వాట్రో ఇంజన్ గరిష్టంగా 245 బిహెచ్‌పిల శక్తిని, 500 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది గరిష్టంగా గంటకు 250 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెడుతుంది. అన్ని రకాల విలాసవంతమైన ఫీచర్లు కలిగిన ఈ కారును నడుపుతున్నప్పుడు ఓ స్పోర్ట్స్ కారును నడుపుతున్న అనుభూతిని పొందటం ఖాయం.


Click it and Unblock the Notifications









