రోల్స్ రాయిస్ ఘోస్ట్‌ను ఖరీదు చేసిన యాక్టర్ విజయ్
బ్రిటీష్ లగ్జరీ కారు రోల్స్ రాయిస్‌ను కలిగిన భారతీయుల్లో మరో కుర్ర హీరో వచ్చి చేరాడు. కోలీవుడ్‌కు చెందిన ఇళయదళపతి విజయ్ తాజాగా ఓ రోల్స్ రాయిస్ కారును కొనుగోలు చేశాడు. ఏఆర్. మురుగదాస్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న యాక్షన్ చిత్రం 'తుపాకీ' విజయాన్ని విజయ్ ముందుగానే ఊహించాడో ఏమో, తన చిత్ర విజయాన్ని ఇలా రోల్స్ రాయిస్‌తో జరుపుకున్నాడు. భారత్‌లో రూ.3 కోట్లకు పైగా ఖరీదు చేసే రోల్స్ రాయిస్ ఘోస్ట్ లగ్జరీ కారును విజయ్ కొనుగోలు చేశాడు. ఈ ఏడాది ఆరంభంలో కోలీవుడ్‌లో పవర్‌ఫుల్ డైరెక్టర్ శంకర్ కూడా ఓ రోల్స్ రాయిస్ ఘోస్ట్‌ను ఖరీదు చేసిన సంగతి తెలిసినదే.
రోల్స్ రాయిస్ ఇండియాలో రెండు మోడళ్లను విక్రయిస్తోంది. అందులో ఒకటి రోల్స్ రాయిస్ ఘోస్ట్ మరొకటి రోల్స్ రాయిస్ ఫాంటమ్. రోల్స్ రాయిస్ ఘోస్ట్‌లో ఎక్స్‌టెండెడ్ వీల్‌బేస్ వేరియంట్ కూడా భారత్‌లో అందుబాటులో ఉంది. కంపెనీ ఇటీవలే ఫాంటమ్‌లో 'ఫాంటమ్ 2' అనే అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. రోల్స్ రాయిస్ ఘోస్ట్ కంపెనీ అందిస్తున్న కార్లలో కెల్లా అత్యంత చవకైనది. 2009లో రోల్స్ రాయిస్ తమ ఘోస్ట్ మోడల్‌ను ఇండియాలో ప్రవేశపెట్టింది. సాటిలేని పెర్ఫామెన్స్, విలాసవంతమైన ఇంటీరియర్స్, కళ్లను ఇట్టే ఆకట్టుకునే ఎక్స్టీరియర్ డిజైన్, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అధునాత టెక్నాలజీ వంటి విశిష్టతలు రోల్స్ రాయిస్ కార్ల ప్రత్యేకం.

రోల్స్ రాయిస్ ఘోస్ట్ - హీరో విజయ్

రోల్స్ రాయిస్ ఘోస్ట్ - ఫ్రంట్ వ్యూ

రోల్స్ రాయిస్ ఘోస్ట్ - సైడ్ వ్యూ

రోల్స్ రాయిస్ ఘోస్ట్ - రియర్ వ్యూ

రోల్స్ రాయిస్ ఘోస్ట్ - ఇంటీరియర్ వ్యూ

రోల్స్ రాయిస్ ఘోస్ట్ - ప్రీమియం లెథర్ సీటింగ్

రోల్స్ రాయిస్ ఘోస్ట్ - రియర్ ప్యాసింజర్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్

రోల్స్ రాయిస్ ఘోస్ట్ - డ్యాష్‌బోర్డుపై ప్రీమియం ఉడ్ (చెక్క) ఫినిషింగ్

రోల్స్ రాయిస్ ఘోస్ట్ - ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్

రోల్స్ రాయిస్ ఘోస్ట్ - సెంటర్ కన్సోల్‌పై ఏర్పాటు చేసిన ఆడియో కంట్రోల్స్

రోల్స్ రాయిస్ ఘోస్ట్

రోల్స్ రాయిస్ ఘోస్ట్

రోల్స్ రాయిస్ ఘోస్ట్

రోల్స్ రాయిస్ ఘోస్ట్

రోల్స్ రాయిస్ ఘోస్ట్

రోల్స్ రాయిస్ ఘోస్ట్
దేశంలో రోల్స్ రాయిస్ కార్లను కలిగి ఉన్న ఓనర్ల జాబితాలో ఇప్పటికే టాలీవుడ్‌లో చిరంజీవి, బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, సంజయ్ దత్, డైరెక్టర్ శంకర్ వంటి ప్రముఖులు ఉండగా, తాజాగా ఈ జాబితాలోకి విజయ్ వచ్చి చేరాడు. గతంలో రాజుల కాలంలోనే రోల్స్ రాయిస్ ఇండియాలో ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. మన నైజాం నవాబులు కూడా ఓ రోల్స్ రాయిస్ కారును ప్రత్యేకించి ఆర్డర్ చేయించుకున్న బ్రిటన్ నుంచి దిగుమతి చేయించుకున్నారు.


Click it and Unblock the Notifications








