హోండా బ్రయో సెడాన్ తర్వాత హోండా బ్రయో ఎమ్‌పివి

హుర్రే.. హోండా బ్రయో ఎమ్‌పివి!హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ అందిస్తున్న ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ హోండా బ్రయోను ఆధారంగా చేసుకొని కంపెనీ ఓ సెడాన్ వెర్షన్‌ను మార్కెట్లో విడుదల చేయటం గురించి, దీనికి సంబంధించిన స్పై చిత్రాల గురించి ఇదివరకటి కథనాల్లో తెలుసుకున్నాం. అయితే, ఇప్పుడు తాజా అప్‌‌డేట్ ప్రకారం, బ్రయో ఫ్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని హోండా ఓ ఎమ్‌పివిని కూడా అభివృద్ధి చేయనున్నట్లు సమాచారం. హోండా బ్రయో ఫ్లాట్‌ఫామ్‌ను ఉపయోగించడం ద్వారా ఈ సెడాన్, ఎమ్‌పివిలను తయారు చేయటానికి అయ్యే ఉత్పాధక వ్యయాన్ని తగ్గించుకోవాలని కంపెనీ భావిస్తున్నట్లుంది.

ఇలా చేయటం వలన తక్కువ ధరకే వీటిని మార్కెట్లో విక్రయించే ఆస్కారం ఉంటుంది. హోండా బ్రయో హ్యాచ్‌బ్యాక్ ఫ్లాట్‌‌ఫామ్ ఆధారంగా రూపొందిన బ్రయో సెడాన్ విడుదల తర్వాత ఈ బ్రయో ఎమ్‌పివి మార్కెట్లోకి రానుంది. అయితే, గతంలో మారుతి సుజుకి ఎర్టిగాకు హోండా తమ పాపులర్ ప్రీమియం సెడాన్ హోండా జాజ్ ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా అభివృద్ధి చేస్తున్న హోండా ఫ్రీడ్ ఎమ్‌పివిని ఇండియన్ మార్కెట్లో విడుదల చేయనున్నట్లు కథనాలు వెలువడిని సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు ఇది హోండా బ్రయో ఫ్లాట్‌ఫామ్‌పై రానున్నట్లు స్పష్టమైంది. ఈ ఎమ్‌పివి తొలుత జకార్తా, ఇండోనేషియాలలో ఉత్పత్తి కానుంది. 2013 చివరి నాటికి ఇది భారత మార్కెట్లోకి రావచ్చని అంచనా.

హోండా బ్రయో ఎమ్‌పివి కూడా బ్రయో సెడాన్ మాదిరిగానే పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కావచ్చని తెలుస్తోంది. ఇది ఈ సెగ్మెంట్లో మారుతి సుజుకి ఎర్టిగా, మహీంద్రా జైలో వంటి మోడళ్లతో పోటీ పడనుంది. కాగా.. హోండా బ్రయో సెడాన్‌ను కంపెనీ ఇప్పటికే థాయ్‌లాండ్ రోడ్లపై టెస్టింగ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది మధ్యభాగం నాటికి ఈ సెడాన్ మార్కెట్లోకి రానుంది.

భారత మార్కెట్లో లభిస్తున్న హోండా బ్రయో హ్యాచ్‌బ్యాక్‌లో అమర్చిన 4-సిలిండర్, 1.2 లీటర్ ఐ-విటెక్ పెట్రోల్ ఇంజన్‌ గరిష్టంగా 88 పిఎస్‌ల శక్తిని, 109 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్, 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. బ్రయో సెడాన్‌లోనూ ఇదే ఇంజన్‌ను ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. డీజిల్ సెడాన్‌లో 1.5 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించవచ్చని సమాచారం. ఈ ఇంజన్ సాంకేతిక వివరాలను మాత్రం కంపెనీ వెల్లడించలేదు. అయితే, బ్రయో ఎమ్‌పివిలో ఏయే ఇంజన్‌లను ఉపయోగించనున్నారనే విషయమ మాత్రం తెలియాల్సి ఉంది.

హోండా బ్రయో ఎమ్‌పివి

హోండా బ్రయో ‌హ్యాచ్‌బ్యాక్ ఆధారంగా ఓ సెడాన్‌ను మార్కెట్లోకి విడుదల చేసిన తర్వాత, అదే ఫ్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని ఓ బ్రయో ఎమ్‌పివిను మార్కెట్లోకి తీసుకురావాలని హోండా సన్నాహాలు చేస్తుంది.

హోండా ఫ్రీడ్ ఎమ్‌పివి

గతంలో మారుతి సుజుకి ఎర్టిగాకు పోటీగా హోండా తమ పాపులర్ ప్రీమియం సెడాన్ హోండా జాజ్ ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా అభివృద్ధి చేస్తున్న హోండా ఫ్రీడ్ ఎమ్‌పివిని ఇండియన్ మార్కెట్లో విడుదల చేయనున్నట్లు కథనాలు వెలువడిని సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు ఇది హోండా బ్రయో ఫ్లాట్‌ఫామ్‌పై రానున్నట్లు స్పష్టమైంది.

హోండా బ్రయో సెడాన్

హోండా బ్రయో హ్యాచ్‌బ్యాక్‌ను ఆధారంగా చేసుకొని కంపెనీ ఓ సెడాన్‌ను అభివృద్ధి చేసింది. ఈ కారును ఇప్పటికే థాయ్‌లాండ్ రోడ్లపై టెస్టింగ్ నిర్వహిస్తోంది. వచ్చే ఏడాది మధ్యభాగం నాటికి ఈ సెడాన్ మార్కెట్లోకి రావచ్చని అంచనా.

హోండా బ్రయో హ్యాచ్‌బ్యాక్

ప్రస్తుతం భారత మార్కెట్లో లభిస్తున్న హోండా బ్రయో హ్యాచ్‌బ్యాక్‌లో అమర్చిన 4-సిలిండర్, 1.2 లీటర్ ఐ-విటెక్ పెట్రోల్ ఇంజన్‌ గరిష్టంగా 88 పిఎస్‌ల శక్తిని, 109 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

హోండా బ్రయో ఆటోమేటిక్

హోండా అందిస్తున్న బ్రయో హ్యాచ్‌బ్యాక్‌లో కంపెనీ ఇటీవలే ఓ ఆటోమేటిక్ వెర్షన్‌ను మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్తగా రానున్న హోండా బ్రయో సెడాన్, హోండా బ్రయో ఎమ్‌పివిలలో కూడా ఆటోమేటిక్ వెర్షన్‌ను కంపెనీ ప్రవేశపెట్టే ఆస్కారం ఉంది.

Source: Theophiluschin.com

More from DriveSpark

Article Published On: Tuesday, November 6, 2012, 12:03 [IST]
English summary
After Honda Brio sedan, Now Japanese carmaker Honda Motors is mulling to bring the Brio based MPV. The Brio based sedan will be first unveiled in April 2013 in India and will be first diesel powered sedan in India by Honda's stable.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+