వెరిటోలో ఎలక్ట్రిక్ వెర్షన్‌ను విడుదల చేయనున్న మహీంద్రా

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) అందిస్తున్న ఏకైక సెడాన్ వెరిటో త్వరలోనే మరో కొత్త అవతారంలో దర్శనమివ్వనుంది. తాజాగా వెరిటోలో ఓ రిఫ్రెష్డ్ వేరియంట్‌ను ప్రవేశపెట్టిన మహీంద్రా ఇందులో ఓ ఎలక్ట్రిక్ వేరియంట్‌ను కూడా ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. ఎలక్ట్రిక్ వెర్షన్ మహీంద్రా వెరిటోను కంపెనీ తొలిసారిగా గడచిన జనవరిలో జరిగిన 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శనకు ఉంచింది.

ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కోసం, మహీంద్రా అండ్ మహీంద్రా స్వాధీనం చేసుకున్న బెంగుళూరుకు చెందిన రేవా కంపెనీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోనుంది. మహీంద్రా రేవా నుంచి తొలిసారిగా రానున్న ఉత్పత్తి రేవా ఎన్ఎక్స్ఆర్ 4-సీటర్ ఎలక్ట్రిక్ కారు. దీని తర్వాత మరిన్ని ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలను కంపెనీ అభివృద్ధి చేయనుంది. ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్ వెర్షన్ మహీంద్రా వెరిటోను కూడా కంపెనీ విడుదల చేయనుంది.


ప్రస్తుతం మహీంద్రా వెరిటో పెట్రోల్, డీజిల్ వెర్షన్లలో లభ్యమవుతుంది. రెనో-మహీంద్రా భాగస్వామ్యంలోని రెనో వాటాలను మహీంద్రా పూర్తిగా స్వాధీనం చేసుకొని, ఈ జేవీ నుంచి తయారైన లోగాన్ కారును వెరిటోగా పేరు మార్చిన తర్వాత ఈ మోడల్ అమ్మకాలు జోరందుకున్నాయి. దీంతో ఇందులో మరోసారి అప్‌గ్రేడెడ్ వేరియంట్‌ను ఎమ్ అండ్ ఎమ్ తాజాగా మార్కెట్లో విడుదల చేసింది.

మహీంద్రా రేవా ఎన్ఎక్స్ఆర్ ప్లాంట్‌ను ప్రారంభించిన సందర్భంగా కంపెనీ ఉన్నతాధికారులు మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ తమ సంస్థ కట్టుబడి ఉంటుందని, భవిష్యత్తులో మరిన్న ప్రకృతి సాన్నిహిత్యమైన మోడళ్లను మార్కెట్లోకి తీసుకువస్తామని చెప్పారు. మహీంద్రా గతంలో ఓ హైబ్రిడ్ వెర్షన్ స్కార్పియోను కూడా ప్రదర్శించింది. రానున్న రోజుల్లో ఈ సంస్థ నుంచి మరిన్ని ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలను మనం చూడనున్నాం.

రేవా ఎన్ఎక్స్ఆర్ ఎలక్ట్రిక్ మార్కెట్లో సక్సెస్‌ను సాధించినట్లయితే, వెంటనే వెరిటో ఎలక్ట్రిక్ కూడా ఉత్పత్తి స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. ఈ కారును కూడా బెంగుళూరు ప్లాంట్‌లోనే తయారు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా, మహీంద్రా రేవా బెంగుళూరు ప్లాంట్‌లో మరో వారంలో రేవా ఎన్ఎక్స్ఆర్ ఉత్పత్తి ప్రారంభం కానుంది. ఈ పండుగ సీజన్‌లో రేవా ఎలక్ట్రిక్ కారును వాణిజ్య పరంగా మార్కెట్లోకి విడుదల చేయనున్నామని కంపెనీ పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Wednesday, August 29, 2012, 16:26 [IST]
English summary
Did you remembered this electric version of Mahindra Verito. India's leading SUV maker Mahindra and Mahindra (M and M) has showcased this electric Verito during the 2012 Delhi Auto Expo. According to recent reports, M and M is planning to launch the Verito electric soon.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+