చెర్రీ ఆస్టన్ మార్టిన్ వి8 వ్యాంటేజ్ గురించి పూర్తి డిటేల్స్
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ పెళ్లి కానుకగా ఆస్టన్ మార్టిన్ కారును పొందిన సంగతి తెలిసిందే. బహుశా హైదరాబాద్‌లో ఆస్టన్ మార్టిన్ కారును తొలి సెలబ్రిటీ మన మగధీరుడేనేమో..! జేమ్స్ బాండ్ వంటి సినిమాల్లో సాహసాలు/అద్భుతాలు చేసే కారుగా పాపులర్ అయిన ఈ ఆస్టన్ మార్టిన్ బ్రాండ్ పట్ల ప్రపంచ వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. మరి మన మగధీరుడి కారు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందామా..!
రామ్ చరణ్‌కు బహుమతిగా వచ్చిన కారు ఆస్టన్ మార్టిన్ వి8 వ్యాంటేజ్. ఇది ప్రపంచంలో కెల్లా అత్యంత అందమైన కార్లలో ఒకటి. పవర్‌ఫుల్ ఇంజన్, ఎక్కడా రాజీ పడని పెర్ఫామెన్, కళ్లు మిరుమిట్లుగొలిపే పెయింట్, మనసును కట్టిపడేసే డిజైన్, స్టయిలిష్ లుక్, విలాసవంతమైన అనుభూతి, సౌకర్యంవతమైన హ్యాండ్లింగ్, సాఫ్ట్‌వేర్ సాయంతో నియంత్రించే పూర్తి ఆటోమేటిక్ వ్యవస్థ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ కారు గురించి చాంతాడంత లిస్టే తయారవుతుంది. ఆస్టన్ మార్టిన్ వి8 వ్యాంటేజ్ పొడవైన బానెట్‌ను కలిగి ఉండి, రెండు డోర్లు, రెండు సీట్లను (డ్రైవర్, ఫ్రంట్ ప్యాసింజర్) మాత్రమే కలిగి ఉంటుంది.
ఆస్టన్ మార్టిన్ వి8 వ్యాంటేజ్‌లో ఉపయోగించిన 4.7 లీటర్ వి8 ఇంజన్ గరిష్టం 420 బిహెచ్‌పిల శక్తిని, 470 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 4.9 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకోగలదు. ఇది గరిష్టంగా గంటకు 290 కి.మీ. వేగంతో పరుగులు పెడుతుంది. దీని బరువును తక్కువగా ఉంచేందుకు గానూ ఆస్టన్ మార్టిన్ దీని తయారీలో తేలిక రకం వస్తువులను, పదార్థాలను ఉపయోగించింది. ఇండియాలో ఆస్టన్ మార్టిన్ వి8 వ్యాంటేజ్ కారు ధర సుమారు రూ.2 కోట్లకు పైమాటే.


Click it and Unblock the Notifications








