నవంబర్ 30న మార్కెట్లోకి రానున్న సరికొత్త రేంజ్ రోవర్

By Ravi

లగ్జరీ ఎస్‌యూవీల తయారీలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ల్యాండ్ రోవర్ తమ సరికొత్త రేంజ్ రోవర్ ఎస్‌యూవీని ఈనెల 30న భారత మార్కెట్లో విడుదల చేయనుంది. ఇటు విలాసానికే కాకుండా అటు ఆఫ్-రోడ్ అడ్వెంచర్‌కు సైతం సూట్ అయ్యేలా అప్‌గ్రేడ్ చేసిన రేంజ్ రోవర్‌ను నవంబర్ 30, 2012 (శుక్రవారం) తేదీన కంపెనీ దేశీయ విపణిలో విడుదల చేయనుంది. పాత రేంజ్ రోవర్‌తో పోల్చుకుంటే ఎన్నో రెట్లు మెరుగ్గా ఉండేలా ల్యాండ్ రోవర్ ఈ కారును తీర్చిదిద్దింది.

ఈ కొత్త మోడల్ తక్కువ బరువును కలిగి ఉండి, మరింత విశాలమైన మరియు విలాసవంతమైన ఇంటీరియర్స్‌ను కలిగి ఉంటుంది. అల్యూమినియం మోనోకాక్ కన్‌స్ట్రక్షన్‌తో నిర్మితమైన ప్రపంచపు మొట్టమొదటి ఎస్‌యూవీ తమదేనని కంపెనీ పేర్కొంది. వాహన ఛాస్సిస్, బాడీ రెండింటి వేర్వేరుగా కాకుండా ఒకే ఫ్లాట్‌ఫామ్‌పై నిర్మించిన నిర్మాణాన్ని మోనోకాక్ అంటారు. ఇందులో ధృఢమైన అల్యూమినియం మెటీరియల్ ఉపయోగించిన కారణంగా ఇది వరకటి మోడల్ కన్నా ఇది 180 కేజీలు తక్కువ బరువును కలిగి ఉంటుంది. (ఇదివరకటి రేంజ్ రోవర్ బాడీ నిర్మాణంలో స్టీల్‌ను ఉపయోగించారు.)

సరికొత్త రేంజ్ రోవర్ - విడుదల

సరికొత్త రేంజ్ రోవర్ - విడుదల

లగ్జరీ ఎస్‌యూవీల తయారీలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ల్యాండ్ రోవర్ తమ సరికొత్త రేంజ్ రోవర్ ఎస్‌యూవీని ఈనెల 30న భారత మార్కెట్లో విడుదల చేయనుంది. ఇటు విలాసానికే కాకుండా అటు ఆఫ్-రోడ్ అడ్వెంచర్‌కు సైతం సూట్ అయ్యేలా అప్‌గ్రేడ్ చేసిన రేంజ్ రోవర్‌ను నవంబర్ 30, 2012 (శుక్రవారం) తేదీన కంపెనీ దేశీయ విపణిలో విడుదల చేయనుంది.

సరికొత్త రేంజ్ రోవర్ - ఎక్స్టీరియర్

సరికొత్త రేంజ్ రోవర్ - ఎక్స్టీరియర్

పాత రేంజ్ రోవర్‌తో పోల్చుకుంటే ఎన్నో రెట్లు మెరుగ్గా ఉండేలా ల్యాండ్ రోవర్ ఈ కారును తీర్చిదిద్దింది.

సరికొత్త రేంజ్ రోవర్ - ఇంటీరియర్

సరికొత్త రేంజ్ రోవర్ - ఇంటీరియర్

సరికొత్త రేంజ్ రోవర్ తక్కువ బరువును కలిగి ఉండి, మరింత విశాలమైన మరియు విలాసవంతమైన ఇంటీరియర్స్‌ను కలిగి ఉంటుంది.

సరికొత్త రేంజ్ రోవర్ - మోనోకాక్ ఛాస్సిస్

సరికొత్త రేంజ్ రోవర్ - మోనోకాక్ ఛాస్సిస్

అల్యూమినియం మోనోకాక్ కన్‌స్ట్రక్షన్‌తో నిర్మితమైన ప్రపంచపు మొట్టమొదటి ఎస్‌యూవీ తమదేనని, ఇందులో ధృఢమైన అల్యూమినియం మెటీరియల్ ఉపయోగించిన కారణంగా ఇది వరకటి మోడల్ కన్నా ఇది 180 కేజీలు తక్కువ బరువును కలిగి ఉంటుందని కంపెనీ పేర్కొంది.

సరికొత్త రేంజ్ రోవర్ - ఇంజన్

సరికొత్త రేంజ్ రోవర్ - ఇంజన్

భారత్‌లో లభ్యం కానున్న కొత్త రేంజ్ రోవర్‌లో 4.4 లీటర్ వి8 ట్విన్-టర్బో డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 335 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేస్తుంది. ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో లభించే ఈ కొత్త కారులో 8-స్పీడ్ జెడ్ఎఫ్ ఆటోమేటిక్ గేర్‌బాక్సును ఉపయోగించారు.

సరికొత్త రేంజ్ రోవర్ - ధరలు

సరికొత్త రేంజ్ రోవర్ - ధరలు

సరికొత్త రేంజ్ రోవర్ మూడు వేరియంట్లలో లభ్యం కానుంది. వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

* రేంజ్ రోవర్ బేసిక్ వేరియంట్ - 1.73 కోట్లు (ఎక్స్-షోరూమ్)

* రేంజ్ రోవర్ మెటాలిక్ పెయింట్ వేరియంట్ - 1.75 కోట్లు (ఎక్స్-షోరూమ్)

* రేంజ్ రోవర్ ఎక్స్‌క్లూజివ్ పెయింట్-షేడ్ వేరియంట్ - 1.78 కోట్లు (ఎక్స్-షోరూమ్)

సరికొత్త రేంజ్ రోవర్ - రియర్ క్యాబిన్ స్పేస్

సరికొత్త రేంజ్ రోవర్ - రియర్ క్యాబిన్ స్పేస్

ఐదు మీటర్ల పొడవు ఉండే ఈ కొత్త రేంజ్ రోవర్ కారులో వెనుక వైపు విశాలమైన క్యాబిన్ స్పేస్ ఉంటుంది. వెనుక డోర్ కొంచెం పెద్దదిగా ఉండి, ప్రయాణికులు సులువుగా కారు లోనికి/బయటకు ప్రవేశించేందుకు సౌకర్యంగా ఉంటుంది.

సరికొత్త రేంజ్ రోవర్ - రియర్ ప్యాసింజర్ ఇన్ఫోటైన్‌మెంట్

సరికొత్త రేంజ్ రోవర్ - రియర్ ప్యాసింజర్ ఇన్ఫోటైన్‌మెంట్

వెనుక సీటులో కూర్చుని ప్రయాణించే ప్రయాణికుల సౌకర్యం కోసం, ముందు సీట్లకు వెనుక భాగంలో పెద్ద ఎల్‌సిడి స్క్రీన్‌లను అమర్చబడి ఉంటాయి. వీటి కంట్రోల్స్‌ను సెంటర్ కన్సోల్‌పై ఏర్పాటు చేయబడి ఉంటాయి.


లగ్జరీ కార్ సెగ్మెంట్లోని బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ సెడాన్, ఆడి క్యూ5 ఎస్‌యూవీలతో పోల్చుకుంటే సరికొత్త రేంజ్ రోవర్ కారు వరుసగా 23 కేజీలు, 85 కేజీల తక్కువ బరువును కలిగి ఉంటుంది. ఐదు మీటర్ల పొడవు ఉండే ఈ కొత్త రేంజ్ రోవర్ కారులో వెనుక వైపు విశాలమైన క్యాబిన్ స్పేస్ ఉంటుంది. వెనుక డోర్ కొంచెం పెద్దదిగా ఉండి, ప్రయాణికులు సులువుగా కారు లోనికి/బయటకు ప్రవేశించేందుకు సౌకర్యంగా ఉంటుంది.

భారత్‌లో లభ్యం కానున్న కొత్త రేంజ్ రోవర్‌లో 4.4 లీటర్ వి8 ట్విన్-టర్బో డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 335 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేస్తుంది. ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో లభించే ఈ కొత్త కారులో 8-స్పీడ్ జెడ్ఎఫ్ ఆటోమేటిక్ గేర్‌బాక్సును ఉపయోగించారు. భారత మార్కెట్లో కొత్త రేంజ్ రోవర్ మూడు వేరియంట్లలో లభ్యం కానుంది. వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

* రేంజ్ రోవర్ బేసిక్ వేరియంట్ - 1.73 కోట్లు (ఎక్స్-షోరూమ్)
* రేంజ్ రోవర్ మెటాలిక్ పెయింట్ వేరియంట్ - 1.75 కోట్లు (ఎక్స్-షోరూమ్)
* రేంజ్ రోవర్ ఎక్స్‌క్లూజివ్ పెయింట్-షేడ్ వేరియంట్ - 1.78 కోట్లు (ఎక్స్-షోరూమ్)

ల్యాండ్ రోవర్ కంపెనీ 3.0 లీటర్ వి6 డీజిల్ ఇంజన్ కలిగి వేరియంట్‌ను జూన్ 2013 నుంచి విక్రయించనుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, November 27, 2012, 14:41 [IST]
English summary
British luxury carmaker Land Rover will launch the all-new Range Rover in India on November 30, 2012. The new model is lighter, more frugal, more spacious and significantly more refined than the previous model. Initially, the Range Rover will be available in India with only the 335bhp, 4.4-litre V8 twin-turbo diesel engine.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+