ఫార్ములా వన్ రేస్‌కు స్వస్తి పలికిన మైఖేల్ షుమాకర్

By Ravi

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఫార్ములా వన్ రేస్ దిగ్గజం మైఖేల్ షుమాఖర్ నిన్న (ఆదివారం) శాన్ పాలోలో జరిగిన బ్రెజిలియన్ రేస్‌తో ఫార్ములా వన్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. షుమాఖర్ తన కెరీర్‌లో 305 ఫార్ములా వన్ రేసుల్లో పాల్గొన్నాడు. అందులో 91 విజయాలు, 7 ఛాంపియన్‌షిప్ టైటిళ్లను షుమీ తన ఖాతాలో వేసుకున్నాడు.

చిన్నతనం నుంచే ఫార్ములా వన్ రేస్ పట్ల ఆసక్తి ఉన్న మైఖేలు షుమాకర్, ఫార్ములా వన్ రేస్ ట్రాక్‌పై ఇప్పటి వరకూ 80,000 కిలోమీటర్లకు పైగా టైర్లు అరిగేలా చకర్లు కొట్టాడు. అమెరికాస్ సర్క్యూట్ యొక్క 10వ ల్యాప్ సమయంలో ఈ ప్రకటన వెలువడింది. గడచిన వారంలో జరిగిన రేస్‌లో 10వ ల్యాప్ పూర్తయిన తర్వాత, వివిధ రేస్ ట్రాక్‌ల మైఖేల్ షుమాఖర్ ప్రయాణించిన మొత్తం దూరం 80,000 కిలోమీటర్లు (49,710 మైళ్లు)ను దాటింది.

మైఖేల్ షుమాకర్ - బాల్యం

మైఖేల్ షుమాకర్ - బాల్యం

మైఖేల్ షుమాకర్‌కు చిన్నప్పటి నుంచే రేస్‌లంటే చాలా ఇష్టం. ఒక సాధారణ తాపీ మేస్త్రీ కుటుంబంలో పుట్టిన షుమీ తాను ఆరేళ్ల వయస్సులో ఉండగానే మోటార్‌సైకిల్ రేసులో విజయం సాధించాడు.

మైఖేల్ షుమాకర్ - రెయిన్ కింగ్

మైఖేల్ షుమాకర్ - రెయిన్ కింగ్

మైఖేల్ షుమాకర్‌ను రెయిన్ కింగ్ అని పిలుస్తారు. భారీ వర్షాల్లో సైతం ఫార్ములా ట్రాక్‌పై అగ్గి పుట్టించగల సత్తా షుమీకి ఉంది. 2003 సంవత్సరంలో వర్షాల సమయంలో షుమీ పాల్గొన్న 30 రేసులకు గాను 17 రేసులు గెలిచి అందిరి చేతా ఔరా అనిపించాడు. అప్పటి నుండి మైఖేల్ షుమాకర్‌ను రెయిన్ కింగ్ అని పిలుస్తారు.

మైఖేల్ షుమాకర్ - వివాదాలు

మైఖేల్ షుమాకర్ - వివాదాలు

మైఖేల్ షుమాకర్‌పై చాలానే వివాదాలు వచ్చాయి. 1994లో బెన్నెటన్ టీమ్ కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌లో స్పెషల్ టెక్నాలజీ ఉపయోగించిన కారణంగా షుమీ రేస్ గెలిచాడని, 1998లో జాక్ బీలెంట్‌ను ట్రాక్‌పై నుంచి తప్పించాడని, ట్రాక్ హార్ష్‌గ్రా డ్రైవ్ చేస్తాడని ఇలా అనేక వివాదాల్లో షుమీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాడు.

మైఖేల్ షుమాకర్ - ట్రాక్ రికార్డ్

మైఖేల్ షుమాకర్ - ట్రాక్ రికార్డ్

షుమాకర్‌ తన కెరీర్‌లో 305 ఫార్ములా వన్ రేసుల్లో పాల్గొన్నాడు. అందులో 91 విజయాలు, 7 ఛాంపియన్‌షిప్ టైటిళ్లను షుమీ తన ఖాతాలో వేసుకున్నాడు.

సచిన్ టెండూల్కర్ - మైఖేల్ షుమాకర్‌

సచిన్ టెండూల్కర్ - మైఖేల్ షుమాకర్‌

సచిన్ టెండూల్కర్, మైఖేల్ షుమాకర్‌ వీరిద్దరూ కూడా వారి వారి రంగాల్లో దిగ్గజాలే. వీరిద్దరికీ స్పీడ్ అంటే మహా ఇష్టం. అందుకే అప్పట్లో ఓ ఫెరారీ కారును షుముకర్ చేతుల మీదుగా సచిన్ టెండూల్కర్‌కు బహుకరించడం కూడా జరిగింది.

మైఖేల్ షుమాకర్‌ - రేస్ కింగ్

మైఖేల్ షుమాకర్‌ - రేస్ కింగ్

అనేక రేసుల్లో విజయం చవి చూసిన మైఖేల్ షుమాకర్‌ను రేస్ కింగ్ అని కూడా పిలుస్తుంటారు.

మైఖేల్ షుమాకర్‌ - విజయాలు

మైఖేల్ షుమాకర్‌ - విజయాలు

మైఖేల్ షుమాకర్‌ - పలుకులు

మైఖేల్ షుమాకర్‌ - పలుకులు


ఫార్ములా వన్ కార్లలో మైఖేల్ షుమాఖర్ ఇప్పటి వరకూ చుట్టిన దూరంతో, రెండు సార్లు భూమిని చుట్టి రావచ్చట. 19 ఎఫ్ సీజన్స్ పూర్తి చేసిన తర్వాత అతను మొలురాయిని అధిగమించగలిగాడు. ఫార్ములా వన్ రంగం నుంచి షుమీ తొలగిపోతుండటం ఎంతో మంది మోటార్‌స్పోర్ట్స్ అభిమానులను నిరుత్సాహానికి గురి చేస్తోంది. ఇప్పటి వరకూ మెర్సిడెస్ బెంజ్ టీమ్‌ను ప్రమోట్ చేస్తూ వచ్చిన మైఖేలు షుమాఖర్ స్థానంలో మెక్‌లారెన్ డ్రైవర్ లెవిస్ హామిల్టన్‌తో కంపెనీ ఓ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. శాన్ పాలోలోని రేసులో ప్రదర్శనకు ఉంచిన మైఖేల్ షుమాఖర్ హెల్మెట్‌పై 'జీవితం అనేది కోరికల గురించి, నా కోరికలు పంచుకున్నందుకు ధన్యవాధములు' అని రాసి ఉంది.

More from DriveSpark

Article Published On: Monday, November 26, 2012, 13:17 [IST]
English summary
Formula 1 Legend Michael Schumacher who retired from racing yesterday at the Brazilian Grand Prix is a a veteran of a record breaing 305 races. He has driven more than 80,000 kilometres on track while racing alone. This is more than twice the distance you travell if you go arond the earth on its equator.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+