నేథర్లాండ్స్‌లో నానో కారును చూశాను: అరుణ్ ఉడుపా
నానో కారును చూడటంలో పెద్ద వింతేముంది.. ప్రతి రోడ్లపై బోలెడు నానో కార్లు కనిపిస్తుంటాయ్ అని లైట్‌గా తీసిపారేయకండి. నెల్లూరులో ఓ తెలుగు వ్యక్తిని కలవడం మామూలే కానీ అదే నెథర్లాండ్స్‌లో ఓ తెలుగు వ్యక్తి కనబడితే మన ఆనందానికి హద్దులు ఉండవు. అలాంటిదే ఈ కారు కూడా..! కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి జిల్లాలో ఉన్న జెఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంటులో పనిచేస్తున్న అరుణ్ ఉడుపా అనే ఓ అధికారి తాజాగా కంపెనీ పనిమీద నెథర్లాండ్స్ వెళ్లినప్పుడు డానియేలి కోర్స్ ఆఫీసులో ఈ కారును చూశారు.
డానియేలి కోర్స్ ఆఫీస్ రిసెప్షన్‌లో ఈ కారును అందరికీ కనిపించే విధంగా డిస్‌ప్లేకు ఉంచారు. ఇక్కడ టాటా నానా కారుతో పాటు ఓ రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్‌ను డిస్‌ప్లేకు ఉంచటం జరిగింది. నెథర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డ్యామ్‌లో ఉన్న టాటా కోర్స్ స్టీల్ ప్లాంట్‌కు ఎదురుగానే ఈ డానియేలి కోర్స్ ఆఫీస్ ఉంది. ఈ ప్రాంతంలో టాటా గ్రూపు గురించి, రతన్ టాటా గురించి తెలియని వారంటూ ఉండరు.
ఇప్పటికే నెథర్లాండ్స్‌లో ఆన్-లైన్ ద్వారా విడిభాగాలను విక్రయించే ఓ వ్యక్తి టాటా నానో కారును దిగుమతి చేసుకొని దానిపై నగర సంచారం చేస్తున్నాడని ఇదివరకే తెలుగు డ్రైవ్ స్పార్క్ ఓ కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం టాటా నానో కేవలం నేపాల్, శ్రీలంక మార్కెట్లకు మాత్రమే అధికారికంగా ఎగుమతి అవుతుంది.
నెథర్లాండ్స్ ట్రిప్‌లో భాగంగా టాటా నానో కారును చూసి, తన అనుభవాన్ని మా డ్రైవ్ స్పార్క్ పాఠకులతో పంచుకున్న అరణ్ ఉడుపా గారికి మా ప్రత్యేక ధన్యావాదములు తెలియజేస్తున్నాం. మీ జీవితంలో కూడా ఇలాంటి మరపురాని అనుభవాలు ఏవైనా ఉంటే మా డ్రైవ్ స్పార్క్ పాఠకులతో పంచుకోగలరు. ఇందుకు మీరు చేయాల్సిందిల్లా, కార్లతో మీకున్న తీపి అనుభవాలను [email protected] మెయిల్ ఐడిపై మెయిల్ చేయటమే.


Click it and Unblock the Notifications









