అశోక్ లేలాండ్ బ్రాండ్ అంబాసిడర్‌గా మహేంద్ర సింగ్ ధోనీ
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అశోక్ లేలాండ్‌తో చేతులు కలిపాడు. హిందుజా గ్రూప్‌కు చెందిన ఫ్లాగ్‌షిప్ కంపెనీ, అతిపెద్ద వాణిజ్య వాహనాల తయారీ సంస్థ అయిన అశోక్ లేలాండ్, మహేంద్ర సింగ్ ధోనీని తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంటున్నామని కంపెనీ పేర్కొంది. అశోక్ లేలాండ్ 60 ఏళ్ల చరిత్రలో ఓ సెలబ్రిటీని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకోవటం ఇదే మొదటిసారి అని, అందులోనూ యువ క్రికెట్ కిరణం ధోనీని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకోవటం సంతోషంగా ఉందని కంపెనీ తెలిపింది.
వాణిజ్య వాహన మార్కెట్లో అశోక్ లేలాండ్‌కు ఇప్పటికే మంచి బ్రాండ్ ఇమేజ్ ఉండగా, ఇందుకు ధీనీ ప్రచారం జోడైతే ఈ బ్రాండ్‌కు మార్కెట్లో మరింత ఆదరణ పెరిగి వ్యాపారాభివృద్ధికి మంచి అవకాశం లభిస్తుందని అశోక్ లేలాండ్ మేనేజింగ్ డైరెక్టర్ వినోద్ కె దాసరి వ్యాఖ్యానించారు. తమ మార్కెట్ విస్తరణ లక్ష్యాన్ని సాధించేందుకు దోనీ ప్రచారం ఎంతగానో సహకరిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
అశోక్ లేలాండ్ కుటుంబంలో ఒకడిగా చేరడం తనకు ఎంతో గర్వంగా ఉందని, ఈ కంపెనీ అందిస్తున్న సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కృషి చేస్తానని ధోని చెప్పారు.


Click it and Unblock the Notifications









