త్వరలో స్టయిల్ ఎమ్‌పివిని ప్రవేశపెట్టనున్న అశోక్ లేలాండ్

ఇప్పటికే తమ జపాన్ భాగస్వామి నిస్సాన్‌తో చేతులు కలిపి రూపొందించిన తేలికపాటి వాణిజ్య వాహనం (లైట్ కమర్షియల్ వెహికల్, ఎల్‌సీవీ) ‘దోస్త్’ను మార్కెట్లోకి విడుదల చేయటం ద్వారా అశోక్ లేలాండ్ ఎల్‌సీవీ విభాగంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే.
అశోక్ లేలాండ్-నిస్సాన్ దోస్త్ ప్లాట్‌ఫామ్‌పై రూపొందించిన ప్యాసింజర్ వాహనాన్ని త్వరలోనే మార్కెట్లోకి తెస్తామని హిందూజా ఆటోమోటివ్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ వి.సుమంత్రన్ తెలిపారు. అంతేకాకుండా ఏ ఏడాదిలోనే దోస్త్ ఎల్‌సీవీలో ఓ సీఎన్‌జీ వెర్షన్ అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన చెప్పారు.
ఇకపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఓ సరికొత్త వాహనాన్ని మార్కెట్లో తీసుకువస్తామని సుమంత్రన్ అన్నారు. హైదరాబాద్‌లో 'దోస్త్' ఎల్‌సీవీ కోసం రెండవ డీలర్‌షిప్ కేంద్రాన్ని ప్రారంభించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. దోస్త్‌కు మార్కెట్లో మంచి ఆదరణ లభిస్తుందని, ఇప్పటికే 5,000 యూనిట్లకు పైగా దోస్త్ ఎల్‌సీవీలను విక్రయించామని ఆయన చెప్పారు.
ప్రస్తుతం దోస్త్ ఎల్‌సీవీ కోసం వెయింటిగ్ పీరియడ్ మూడు నెలలుగా ఉంది. ఏటా 18 నుంచి 22 శాతం మేర వృద్ధి చెందుతున్న ఎల్‌సీవీ సెగ్మెంట్‌లో వీలైనంత అధిక మార్కెట్ షేర్‌ను దక్కించుకోవాలని భావిస్తున్నామని ఆయన తెలిపారు. జనవరిలో జరిగిన ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన మల్టీ ఫంక్షనల్ వెహికల్ ‘స్టైల్’, రిఫ్రిజిరేటెడ్ కంటైనర్ ‘పార్ట్‌నర్’ వాహనాలను త్వరలోనే మార్కెట్లోకి తీసుకు వచ్చేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది.


Click it and Unblock the Notifications








