వచ్చే ఏడాది ఆరంభంలో అశోక్ లేలాండ్ స్టైల్ విడుదల

By Ravi

ప్రముఖ వాణిజ్య వాహనాల తయారీలో పేరుగాంచిన హిందూజా గ్రూపుకు చెందిన ఫ్లాగ్‌షిప్ కంపెనీ అశోక్ లేలాండ్, తమ జపనీస్ భాగస్వామితో కలిసి తొలిసారిగా ఎల్‌సివి మార్కెట్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఈ జాయింట్ వెంచర్ నుంచి వచ్చిన దోస్త్ ఎల్‌సివికి మార్కెట్లో మంచి స్పందన లభించడంతో కంపెనీ ఇప్పుడు ప్యాసింజర్ వాహన విభాగంలో కూడా ప్రవేశించాలని నిర్ణయించింది.

భారత మార్కెట్ కోసం నిస్సాన్ ఇండియా ఈనెల 26న విడుదల చేయనున్న నిస్సాన్ ఇవాలియా ఎమ్‌పివి రీబ్యాడ్జ్‌డ్ వెర్షన్ అశోక్ లేలాండ్ స్టైల్‌ను కంపెనీ వచ్చే ఏడాది ఆరంభంలో విడుదల చేస్తామని కంపెనీ తెలిపింది. అంతేకాకుండా, ఈ ఏడాది చివరి త్రైమాసికంలో సిఎన్‌జి దోస్త్‌ను కూడా మార్కెట్లో అందుబాటులోకి తెస్తామని అశోక్ లేలాండ్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ నితిన్ సేఠ్ వెల్లడించారు.


అశోక్ లేలాండ్‌ స్టయిల్ గురించి సింపుల్‌గా చెప్పాలంటే, ఇది నిస్సాన్ ఇవాలియాకు అచ్చు గుద్దినట్లు జెరాక్స్ కాపీ మాదిరిగా ఉండనుంది. అయితే, నిస్సాన్ బ్యాడ్జ్ స్థానంలో అశోక్ లేలాండ్ బ్యాడ్జ్ కనిపించనుంది. అశోక్ లేలాండ్ తమ స్టయిల్ ఎమ్‌పివి గడచిన జనవరిలో జరిగిన 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో కంపెనీ తొలిసారిగా ప్రదర్శనకు ఉంచింది.

ఇందులో పాపులర్ 1.5 లీటర్ టర్బోఛార్జ్‌డ్ కె9కె డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఇది గరిష్టంగా 3750 ఆర్‌పిఎమ్ వద్ద 85 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని, 1900 ఆర్‌పిఎమ్ వద్ద 200 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్ (గేర్ బాక్స్) కలిగిన అశోక్ లేలాండ్ స్టయిల్ లీటర్ డీజిల్‌కు సుమారు 20 కి.మీ. మైలేజీని ఇవ్వనుంది.

More from DriveSpark

Article Published On: Saturday, September 15, 2012, 17:56 [IST]
English summary
Commercial vehicle manufacturer Ashok Leyland Ltd plans to launch its multi-purpose vehicle Stile early next year. The Stile MPV is developed by the joint venture partner Nissan-Renault venture.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+