ఆస్టన్ మార్టిన్ డిబిఎస్ స్థానాన్ని వాంక్విష్‌తో రీప్లేస్

జేమ్స్ బాండ్ సినిమాల ద్వారా యావత్ ప్రపంచంలో ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న ఆస్టన్ మార్టిన్ డిబిఎస్ మోడల్ ఇకపై కనుమరుగు కానుంది. డిబిఎస్ మోడల్ స్థానాన్ని సరికొత్త వాంక్విష్ (Vanquish) మోడల్‌తో రీప్లేస్ చేస్తున్నామని బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ ఆస్టన్ మార్టిన్ పేర్కొంది.

ఇదివరకటి వెర్షన్‌ను కొనసాగింపుగా ఈ అప్‌గ్రేడెడ్ వెర్షన్ వాంక్విషన్ కారను విడుదల చేస్తున్నామని, డిబిఎస్ కన్నా ఇది టెక్నాలజీ పరంగానూ, లుక్ అండ్ స్టయిల్ పరంగానూ మెరుగ్గా ఉంటుందని కంపెనీ వివరించింది.


ఆస్టన్ మార్టిన్ వాంక్విష్ ధర 1,90,000 బ్రిటీష్ పౌండ్లు (మన దేశ కరెన్సీలో దిగుమతి సుంకాలు కలుపుకోక మునుపు సుమారు రూ.1.66 కోట్లు, సుంకాలను కలుపుకుంటే రూ.2 కోట్లకు పైమాటే)గా నిర్ణయించామని కంపెనీ తెలిపింది. 565 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేసే ఇంజన్‌ను కలిగిన ఆస్టన్ మార్టిన్ వాంక్విష్ కేవలం 4.1 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 183 మైళ్ల వేగంతో పరుగులు తీస్తుంది.

ఆస్టన్ మార్టిన్ డిబిఎస్ మోడల్‌లో ఉపయోగించిన 6.0 లీటర్ వి12 ఇంజన్ రీ-ఇంజనీరింగ్ చేసి వాంక్విష్ మోడల్‌లో ఉపయోగించారు. ఇది పాత వేరియంట్ కన్నా అధిక శక్తిని, టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ కారు వెలుపలి వైపు బాడీ ప్యానెల్స్ మొత్తాన్ని ధృఢమైన కార్బన్ ఫైబర్ మెటీరియల్‌తో తీర్చిదిద్దారు.

ఆస్టన్ మార్టిన్ వాంక్విషన్ మోడల్‌లోని కొన్ని డిజైన్ అంశాలను ఈ కంపెనీ నుంచి లభ్యమవుతున్న అత్యంత ఖరీదైన మోడల్ వన్-77 (సుమారు రూ.22 కోట్లు) నుంచి స్ఫూర్తి పొంది డిజైన్ చేశారు. త్వరలోనే ఈ మోడల్ ఇండియన్ మార్కెట్లో సైతం లభ్యమయ్యే ఆస్కారం ఉంది.

More from DriveSpark

Article Published On: Thursday, June 21, 2012, 10:39 [IST]
English summary
British luxury car maker Aston Martin has replaced the DBS with the new Vanquish. The new Vanquish marks an evolution over the previous model. Priced at 190,000 pounds (Rs. 1.66 crore before import duties), the car makes 565 bhp, takes 4.1 seconds to hit a tonne and goes flat out all the way up to 183 mph.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+