ఫేస్‌బుక్ ఎడిషన్ డిబి9 కారును విడుదల చేసిన ఆస్టన్ మార్టిన్
మార్క్ జుకెర్‌బర్గ్ రూపొందించిన ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ 'ఫేస్‌బుక్' ప్రపంచ వ్యాప్తంగా ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. దూరాలను దగ్గర చేస్తూ, కొత్త స్నేహాలను పరిచయాలను పెంచుకునేందుకే కాకుండా సమాచారాన్ని పంచుకునేందుకు, కంపెనీలకు తమ ఉత్పత్తులును మార్కెటింగ్ చేసుకుందేకు కూడా ఇది సహకరిస్తున్న సంగతి తెలిసిందే.
సరే ఇదంతా అటుంచి అసలు విషయానికి వస్తే.. ఫేస్‌బుక్‌లో ఆటోమొబైల్ కంపెనీలు తమ అధికారి ఫ్యాన్‌పేజ్‌లను క్రియేట్ చేసుకొని ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సంపాదించుకుంటున్నారు. దీని తమ ఉత్పత్తుల గురించి సమాచారాన్ని సులువుగా కస్టమర్లకు చేరవేస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్రిటీష్‌కు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ కంపెనీ ఆస్టన్ మార్టిన్ కూడా ఫేస్‌బుక్‌లో అశేష ప్రజాదరణను సొంతం చేసుకొంది.
ఫేస్‌బుక్‌లో 10 లక్షల మంది అభిమానులను సొంతం చేసుకున్న తర్వాత ప్రత్యేకించి ఓ స్పెషల్ ఎడిషన్ కారును డిజైన్ చేస్తామని ఆస్టన్ మార్టిన్ ఫేస్‌బుక్‌లో ఓ స్పెషల్ క్యాంపైన్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం ఫేస్‌బుక్‌లో ఆస్టన్ మార్టిన్ 17 లక్షలకు పైగా అభిమానులను సొంతం చేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆస్టన్ మార్టిన్ ఇటీవలే ఓ ఫేస్‌బుక్ ఎడిషన్ డిబి9 కారును విడుదల చేసింది.
ఫేస్‌బుక్‌లో అభిమానులు ఇచ్చిన సలాహాల మేరకు ఈ స్పెషల్ ఎడిషన్ కారును డిజైన్ చేశామని కంపెనీ పేర్కొంది. పది లక్షల అభిమానులు గుర్తు చేసేలా ఈ కారుకు డిబి9 1ఎమ్ (Aston Martin DB9 1M) అనే పేరును ఆస్టన్ మార్టిన్ పెట్టింది. ఫేస్‌బుక్ నుంచి స్ఫూర్తి పొందిన బ్లూ కలర్, మరియు తెలుపు రంగు బాడీ లైన్స్, అల్లాయ్ వీల్స్‌తో ఇంటీరియర్స్ నుంచి ఎక్స్టీరియర్స్ వరకూ అన్నింటిన ఫేస్‌బుక్ అభిమానులే డిజైన్ చేశారు. ఆస్టన్ మార్టిన్ వారి డిజైన్లకు కేవలం ప్రాణం మాత్రమే పోసింది.
అయితే, ఈ ఫేస్‌బుక్ ఎడిషన్ కారు అమ్మకానికి మాత్రం కాదు. కేవలం ఒకే ఒక్క కారును మాత్రమే ఆస్టన్ మార్టిన్ నిర్మించింది. ఫేస్‌బుక్ అభిమానుల జ్ఞాపకార్థం ఈ కారును కంపెనీ రూపొందించింది. ఫేస్‌బుక్ పవర్ అంటే ఇదే మరి..!!


Click it and Unblock the Notifications








