భారత్‌లో ఆస్టన్ మార్టిన్ వాంక్విష్ స్పోర్ట్ కారు విడుదల
బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ ఆస్టన్ మార్టిన్ ఇటీవల గ్లోబల్ మార్కెట్లో విడుదల చేసిన సరికొత్త సూపర్ స్పోర్ట్స్ కార్ వాంక్విష్ (Vanquish)ను కంపెనీ ఇప్పుడు ఇండియన్ మార్కెట్లోకూడా విడుదల చేసింది. గతంలో కంపెనీ అందిస్తున్న ఆస్టన్ మార్టిన్ డిబిఎస్ మోడల్ స్థానాన్ని భర్తీ చేస్తూ ఆస్టన్ మార్టిన్ వాంక్విష్ మోడల్‌ను కంపెనీ పరిచయం చేయటం జరిగింది.
ఆస్టన్ మార్టిన్ డిబిఎస్ మోడల్‌కు కొనసాగింపుగా ఈ అప్‌గ్రేడెడ్ వెర్షన్ వాంక్విషన్ కారును విడుదల చేస్తున్నామని, పాత వెర్షన్ కన్నా ఇది టెక్నాలజీ పరంగానూ, లుక్ అండ్ స్టయిల్ పరంగాను ఎన్నో రెట్లు మెరుగ్గా ఉంటుందని కంపెనీ వివరించింది. జూన్ 21, 2012న ఆస్టన్ మార్టిన్ తొలిసారిగా తమ వాంక్విష్ సెడాన్‌ను గ్లోబల్ మార్కెట్‌కు పరిచయం చేసింది. అతి త్వరలోనే ఈ కారు ఇండియన్ మార్కెట్‌కు రావటం చెప్పుకోదగిన అంశం.
ఇండియన్ మార్కెట్లో ఆస్టన్ మార్టిన్ వాంక్విష్ ధర రూ.3.85 కోట్లు (ఎక్స్-షోరూమ్, ముంబై)గా ఉంది. ఆస్టన్ మార్టిన్ డిబిఎస్ మోడల్‌లో ఉపయోగించిన 6.0 లీటర్ వి12 ఇంజన్ రీ-ఇంజనీరింగ్ చేసి వాంక్విష్ మోడల్‌లో ఉపయోగించారు. ఇది గరిష్టంగా 565 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 4.1 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 183 మైళ్ల వేగంతో పరుగులు తీస్తుంది. పాత వెర్షన్‌తో పోల్చుకుంటే దీని పవర్, టార్క్‌లు అధికం.
ఆస్టన్ మార్టిన్ వాంక్విష్ కారు వెలుపలి వైపు బాడీ ప్యానెల్స్ మొత్తాన్ని ధృఢమైన కార్బన్ ఫైబర్ మెటీరియల్‌తో తీర్చిదిద్దారు. ఆస్టన్ మార్టిన్ వాంక్విషన్ మోడల్‌లోని కొన్ని డిజైన్ అంశాలను ఈ కంపెనీ నుంచి లభ్యమవుతున్న అత్యంత ఖరీదైన మోడల్ వన్-77 (సుమారు రూ.22 కోట్లు) నుంచి స్ఫూర్తి పొంది డిజైన్ చేశారు. లాంబోర్గినీ అవంటేడర్, ఫెరారీ ఎఫ్ఎఫ్ వంటి కార్లకు ఇది గట్టి పోటీగా నిలువనుంది.


Click it and Unblock the Notifications








